మహేష్ రికార్డును మెగా అభిమానులు బ్రేక్ చేయగలరా?

ఆదివారం ట్విట్టర్ వరల్డ్ లో మహేష్ బాబుకి బర్త్ డే విషెస్ వెల్లువలా వచ్చాయి. అభిమానులే కాకుండా చాలా మంది స్టార్ హీరోలు మహేష్ బాబుకి స్పెషల్ గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. #HBDMaheshaBabu హ్యాష్ ట్యాగ్ వరల్డ్ నెంబర్ వన్ హ్యాష్ ట్యాగ్ గా సరికొత్త రికార్డు క్తియేట్ చేసింది. అభిమానులంతా కలిసి 60.2మిలియన్ ట్వీట్స్ చేయడం సంచలనానికి దారి తీసింది.

ఇక నెక్ట్స్ ఈ రికార్డును మెగా అభిమానులు బ్రేక్ చేయగలరా అనే విషయం హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే మెగాస్టార్ ఈ నెల 22న 65వ పుట్టిన రోజును జరుపుకొనున్నారు. ఆ తరువాత సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్ డే ఉండడంతో మెగా అభిమానులకు పెద్ద టాస్క్ వచ్చి పడింది. ముందు మెగాస్టార్ బర్త్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయ్యేలా చేసి ఆ తరువాత పవన్ కళ్యాణ్ బర్త్ డే ట్యాగ్ తో కూడా రికార్డు క్రియేట్ చేయాలి. ఇప్పటికే పవర్ స్టార్ అడ్వాన్స్ బర్త్ డే విషెస్ తో ఒక రికార్డ్ క్రియేట్ చేసిన ఫ్యాన్స్ ఇప్పుడు మహేష్ అభిమానుల క్రియేట్ చేసిన కొత్త రికార్డ్ ని బ్రేక్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. మరి ఈ వార్ లో ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.