బిగ్‌బాస్-4 మరింత రసవత్తరంగా మారుతోంది. మరికొద్దిరోజుల్లో షో ముగియనున్న క్రమంలో కంటెస్టెంట్లు అందరూ గేమ్‌పై ఫోకస్ పెట్టి బలంగా ఆడుతున్నారు. కంటెస్టెంట్లు ఒకరిపై ఒకరు గట్టి గట్టిగా అరుచుకోవడం, కొంతమంది ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకోవడం లాంటివి బిగ్‌బాస్‌లో కామన్ అయిపోయాయి. దీంతో వీటినే ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు.
గతవారం ఎలిమినేట్ అయిన మెహబూబ్ తాజాగా తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారుతోంది. అభిజిత్, షోయెల్కు ఓటు వేయాలని మెహబూబ్ కోరాడు. షోయెల్, మెహబూబ్ బిగ్‌బాస్‌లో బెస్ట్ ఫ్రెండ్స్ అయిన విషయం తెలిసిందే. ఇటీవల మెహబూబ్ ఎలిమినేట్ అయినప్పుడు షోయెల్ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నాడు.
ఇక తనకు అన్న లేదని, అభిజిత్ బిగ్‌బాస్‌లో తనను సొంత అన్నలాగా చూసుకున్నాడని ఎలిమినేట్ అయిన సమయంలో మెహబూబ్ చెప్పాడు. దీంతో వీరిద్దరికి ఓటు వేయాలని మెహబూబ్ పెట్టడంతో.. వారిద్దరిలో ఒకరు విన్నర్ కావాలని మెహబూబ్ ఆశిస్తున్నట్లు అర్థమవుతోంది.