క్రిస్మ‌స్‌కు నితిన్ సినిమా రిలీజ్?

నితిన్- కీర్తి సురేష్ కాంబినేష‌న్‌లో వెంకీ అట్లూరి తెర‌కెక్కించిన ‘రంగ్ దే’ సినిమాను క్రిస్మ‌స్ కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాత‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. మాములుగా రానున్న‌ సంక్రాంతికి ఈ సినిమాను విడుద‌ల చేయాల‌ని సినిమా యూనిట్ భావించింది. కానీ సంక్రాంతికి చాలా సినిమాలు విడుద‌ల‌య్యే అవ‌కాశ‌ముండ‌టంతో అప్పు‌డు విడుద‌ల చేస్తే భారీ పోటీ ఉండే అవ‌కాశ‌ముంది. దీంతో క్రిస్మ‌స్‌కు విడుద‌ల చేస్తే పోటీ ఉండ‌దు. అంతేకాకుండా క‌లెక్షన్లు కూడా బాగా వ‌చ్చే అవ‌కాశం ఉండ‌టంతో ఆ రోజు విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నారు.

nitin

ఈ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే పూర్తికాగా.. ఇటీవ‌ల వీడియో సాంగ్ టీజ‌ర్ల‌ను కూడా సినిమా యూనిట్ విడుద‌ల చేసింది. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా రాబోతోంది. ఈ సినిమాపై నితిన్ భారీగా ఆశ‌లు పెట్టుకున్నాడు. ఈ సినిమాతో హిట్ కొట్టి మ‌ళ్లీ క‌మ్ బ్యాక్ ఇవ్వాల‌ని నితిన్ భావిస్తున్నాడు. ఈ సినిమా ఎప్పుడో విడుద‌ల కావాల్సి ఉండ‌గా.. లాక్‌డౌన్ వ‌ల్ల షూటింగ్ ఆగిపోవ‌డంతో ఆల‌స్య‌మైంది.

ఇప్పుడు మ‌ళ్లీ విడుద‌ల ఆల‌స్య‌మైతే నిర్మాత‌ల‌కు మ‌రింత న‌ష్టం జ‌రిగే అవ‌కాశ‌ముంది. దీంతో క్రిస్మ‌స్‌కు విడుద‌ల చేయాల‌ని సినిమా యూనిట్ అనుకుంటోంది. మ‌రి చూడాలి ఈ వార్త‌లు ఎంత‌వ‌ర‌కు నిజ‌మ‌నేది.