మెఘా ఆకాష్, నరేష్ అగస్య నటిస్తున్న తొలి తెలంగాణ డిటెక్టివ్ సిరీస్ ‘వికటకవి’

కొత్త కథలను ఆహ్వానించడంలో అన్ని భాషలకి అందుబాటులో ఉండే ఒకటి ప్లాట్ఫామ్ ZEE5. అలాగే ఈసారి ఓ సరికొత్త వెబ్ సిరీస్తో మన ముందుకు రాబోతుంది. మేఘ ఆకాష్, నరేష్ అగస్త్య ప్రధాన పాత్రలు పోషిస్తూ వికటకవి అనే ఓ వెబ్ సిరీస్ రాబోతుంది. దీనిని ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ రామ్ తాళ్లూరి గారు నిర్వహిస్తున్నారు. అయితే తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో డిటెక్టివ్ వెబ్ సిరీస్ రావడం ఇదే మొదటిసారి. ఈ వెబ్ సిరీస్ కు సినిమాటోగ్రఫీ షోయబ్ సిద్ధి చేస్తుండగా అజయ్ అరసాడ సంగీతాన్ని అందిస్తున్నారు.

తెలంగాణలోని నల్లమల ప్రాంతంలో అమరగిరి అనే గ్రామాన్ని 30 ఏళ్లగా ఓ శాపం పట్టిపీడిస్తోంది. అయితే ఆ శాపం వల్ల ఆ గ్రామంలో జరుగుతున్న కథనాలను అటు పురాణ కథలను, ఇటు ఆధునిక కుట్రలను ఎలుక ఉన్న రహస్యాలను వెలికితీస్తూ డిటెక్టివ్ రామకృష్ణ చేసే ప్రయత్నాలు అలాగే శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంలో నీటిమట్టం పెరగడం వల్ల కొన్ని సత్యాలు కనిపించకపోవడం వీటి చుట్టూ తిరిగే కదా అలాగే వీటివల్ల రామకృష్ణకు ఎదురైన సవాళ్లు అతను ఎలా పరిష్కరిస్తాడు అనేది ఈ వికటకవి వెబ్ సిరీస్.

నటీనటులు:

నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్, సిజ్జు అబ్దుల్ రషీద్, తారక్ పొన్నప్ప, రమ్యా రామకృష్ణన్, రఘు కుంచె, రషా కిర్మాణి, అమిత్ తివారి, రవితేజ నన్నిమల, గిరిధర్, సంతోష్ యాదవ్, సాయి ప్రసన్న, అశోక్ కుమార్.కె తదితరులు

సాంకేతిక వర్గం:

బ్యానర్ – ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్

నిర్మాత – రామ్ తాళ్లూరి

దర్శకత్వం – ప్రదీప్ మద్దాలి

కథ, కథనం, మాటలు – తేజ దేశ్‌రాజ్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – విద్యాసాగర్.జె

సినిమాటోగ్రఫీ – షోయబ్ సిద్ధికీ

ఎడిటర్ – సాయిబాబు తలారి

మ్యూజిక్ – అజయ్ అరసాడ

ఆర్ట్ – కిరణ్ మామిడి

ఫైట్స్ – వింగ్ చున్ అంజి

కాస్యూమ్స్ – జె.గాయత్రీ దేవి

కో డైరెక్టర్ – హెచ్.శ్రీనివాస్ దొర

చీఫ్ అసిసోయేట్ – రాజ్ కుమార్ కూసానా

ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ – సుధాకర్ ఉప్పాల (సూర్య)