మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాతో అదిరిపోయే రీ ఎంట్రీ ఇచ్చారు గాని కథల విషయంలో మాత్రం నిత్యం ఏదో ఒక విమర్శలు ఎదుర్కోవల్సి వస్తోంది. ఆచార్య సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వగానే ఆ పోస్టర్ ని చూసి కూడా కాన్సెప్ట్ కాపీ కొట్టినట్లు అనుమానాలు వస్తున్నాయని ఒక రైటర్ ఆరోపించారు.
మొదట ఖైదీ నెంబర్ 150సినిమాను తమిళ్ లో తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే ఆ కథను మురగదాస్ కాపీ కొట్టడాని నరసింహా అనే రైటర్ ఆరోపించారు. అనంతరం తెలుగులో రీమేక్ చేస్తుండగా అతను మీడియా ముందుకు వచ్చాడు. మొత్తానికి ఆ వివాదాన్ని సైలెంట్ గానే ముగుంచేశారు. ఇక సైరా నరసింహా రెడ్డి రిలీజ్ అప్పుడు కూడా ఉయ్యాలవాడ వారసులు తమ అనుమతి తీసుకోవాలని మెగాస్టార్ ఇంటి ముందు ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఆచార్య విషయంలో తన కాన్సెప్ట్ ని కాపీ కొట్టి ఉంటారనే అనుమానం కలుగుతోందని కన్నెగంటి అనిల్ కృష్ణ అనే రైటర్ ఆరోపించారు. 2006లోనే తాను పుణ్యభూమి అనే టైటిల్‌తో ఒక కథను రైటర్స్ అసోసియేషన్‌లో రిజిస్ట్ చేయించానని చెబుతూ.. తన స్టోరీ ఆధారంగానే సినిమా తీస్తున్నారేమో.. అనే అనుమానం కలుగుతుందని అనిల్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. మరి ఈ ఆరోపణలపై చిత్ర యూనిట్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.