నటుడు రాజశేఖర్ రీసెంట్ గా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఇక ఆయన ఆరోగ్యంపై కూతురు శివాత్మిక ఈ ఉదయం చేసిన ట్వీట్ అభిమానులను కొంత ఆందోళనకు గురి చేసింది. పరిస్థితి క్రిటికల్‌గానే ఉన్నట్లు తెలిపారు. నాన్న త్వరగానే కోలుకొని ఇంటికి రావాలని కోరుకుంటూ.. అభిమానులందరిని ప్రార్థన చేయమని కోరారు. కరోనాతో నాన్న పొరాటం కాస్త కష్టంగా మారింది. అయినప్పటికీ ఆయన దైర్యంగా కరోనాతో పోరాడుతున్నారు. మీ ప్రార్దనలు, ప్రేమ, అభిమానం ఆయన్ని రక్షిస్తాయని నమ్ముతున్నామని అంటూ.. శివాత్మిక ట్వీట్ చేసింది.
ఇక కొద్దిసేపటికి హాస్పిటల్ యాజమాన్యం కూడా రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై పాజిటివ్ గా స్పందించారు. ఓ బులిటెన్‌ను విడుదల చేస్తూ… ప్రస్తుతం ఐసీయూలో ఉన్న రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి కుదుటపడిందని, అదే విధంగా ఆయన చికిత్సకు స్పందిస్తున్నారని కూడా తెలిపింది. అయితే ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తాము అన్ని రకాల చికిత్సలు అందిస్తున్నామని ప్రెస్ నోట్ ద్వారా వైద్యులు వివరణ ఇచ్చారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై స్పందించారు. శివాత్మిక ట్వీట్ పై స్పందిస్తూ.. ప్రియమైన శివత్మికా మీ ప్రేమగల నాన్న నా సహా నటుడు మరియు స్నేహితుడు రాజశేఖర్ వీలైనంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. మా శుభాకాంక్షలు మరియు ప్రార్థనలు ఆయనతో మరియు మీ కుటుంబ సభ్యులపై ఎప్పటికి ఉంటాయి. ధైర్యంగా ఉండు అంటూ ట్వీట్ చేశారు