తెలుగు చిత్ర పరిశ్రమ బాస్ గా భావించే మెగాస్టార్ చిరంజీవి గారి పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ లో చేరింది. కొద్ది సంవత్సరాల క్రితం ఆయన చేసే సేవలకు డాక్టరేట్ పురస్కారం లభించగా ఇటీవలే చిరంజీవి గారికి పద్మ విభూషణ్ కూడా రావడం విశేషం. అయితే ఇప్పుడు మరింత అరుదైన గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చిరంజీవి గారి పేరు చేరింది. ఈ విషయాన్ని మరికొంతసేపట్లో బాలీవుడ్ స్టార్ నటుడు అమీర్ ఖాన్ ప్రకటించనున్నారు. ఈరోజు హైదరాబాద్లోని ఐటిసి కోహినూర్ వేదికగా గిన్నిస్ వరల్డ్ ప్రకటన కార్యక్రమంలో ఈ విషయం నిర్ధారించినట్లు సమాచారం.
కొణిదల శివశంకర వరప్రసాద్ 1955 అక్టోబర్ 22న జన్మించారు. ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఈయన ఈరోజు ఈ స్థాయికి రావడం తెలుగు చిత్ర పరిశ్రమకు గర్వకారణం. 1979లో పునాదిరాళ్లు అనే సినిమాతో తొలిసారి వెండి తలపై కనిపించారు. ఆ తర్వాత సుమారు 150 కి సినిమాలకు పైగా చిరంజీవి నటించడం జరిగింది. పద్మ భూషణ్, నంది అవార్డు అలాగే కొన్ని ఫిల్ఫైర్ అవార్డును కూడా ఆయన గతంలో సాధించిన విషయం అందరికీ తెలిసిందే.
ఇటీవల అక్క నేను నాగేశ్వరావు గారి శతజయంతి సందర్భంగా అక్కినేని నాగార్జున ఏఎన్ఆర్ అవార్డును చిరంజీవి గారికి ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. త్వరలోనే చిరంజీవి 156వ చిత్రం అయిన విశ్వంభర తెలుగు స్టార్ దర్శకుడైన వశిష్ట దర్శకత్వంలో 2025లో రాబోతుంది.