‘మెగాస్టార్’ చీటింగ్.. ‘గుండు’ సీక్రెట్ బయటపడింది!!

Chiranjeevi Gundu Look Making Video | Megastar Chiranjeevi New Look | TFPC

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల గుండు బాస్ గా కనిపించి మెగా అభిమానులకు ఒక్కసారిగా షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. మెగా స్టార్ అంటేనే హెయిర్ స్టైల్ తో సరికొత్తగా ఆకట్టుకుంటారు. అలాంటిది ఆయన నున్నగా గుండు గీయించుకొని ఎందుకు కనిపించారు అనే విషయం అందరిని. కన్ఫ్యూజన్ కి గురి చేసింది.

ఇక మొత్తానికి అసలు రహస్యం బయటపడింది. మెగాస్టార్ నిజంగా గుండు చేయించుకోలేదు. మేకప్ టెక్నీషియన్స్ తో అలా సరికొత్తగా తనను తాను మార్చుకున్నారు. ఒక విధంగా మెగాస్టార్ మోసం చేశారనే చెప్పాలి. వేదళం సినిమా కోసం గుండుతో కనిపిస్తారని అందరికి తెలిసిందే. కానీ అది నిజమైన గుండు కాదట. ఇలా కనిపిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో టెస్ట్ షూట్ కి సిద్ధమయ్యారు. లుక్ అయితే అదిరింది. మరి సినిమాలో ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.