Megastar: మెగాస్టార్‌ ‘ఆచార్య’ ఫ‌స్ట్ సాంగ్ అప్‌డేట్‌..

Megastar: మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న తాజా చిత్రం ఆచార్య నుంచి స‌రికొత్త అప్‌డేట్ వ‌చ్చేసింది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వంలో, కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్‌, మ్యాట్నీ ఎంట‌ర్ టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ చిత్రంకు సంబంధించి పోస్ట‌ర్ల్‌, టీజ‌ర్‌, రిలీజ్ అయి ప్రేక్ష‌కుల‌ను ఎంతో ఆక‌ట్టుకున్నాయి. దీంతో ప్రేక్ష‌కులు ఈ చిత్రంపై ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. మే 13న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానున్న నేప‌థ్యంలో.. ఈMegastar చిత్రం నుంచి స‌రికొత్త అప్‌డేట్ చిత్ర‌బృందం అనౌన్స్ చేసింది. ఆచార్య చిత్రం నుంచి తొలి సాంగ్‌ను మ‌హాశివ‌రాత్రి కానుక‌గా మార్చి 11న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది.

ప్ర‌ముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్ మ‌ణిశ‌ర్మ ఈ చిత్రానికి స్వరాలు స‌మ‌కురుస్తున్నారు.. అయితే చాలా రోజుల త‌ర్వాత చిరంజీవి సినిమాకు మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు. దీంతో సంగీత ప్రియుల్లోనే కాకుండా ప్రేక్ష‌కుల్లో కూడా తొలి సాంగ్ అప్‌డేట్ వ‌చ్చిన నేప‌థ్యంలో ఎంతో ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. మెగాప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్‌, పూజాహెగ్దే, రియ‌ల్ హీరో సోనూసూద్ త‌దిత‌రులు ఈ Megastar చిత్రంలో న‌టిస్తున్నారు.