ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల సమయం నుండి మెగా ఫ్యామిలీ అలాగే అల్లు ఫ్యామిలీ మధ్య విభేదాలు ఉన్నట్లు అభిమానులు అనుకుంటున్నారు. ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ తన మిత్రుడైన వైసిపి క్యాండిడేట్ ను కలవడం జరిగింది. దానితో అభిమానులు అలాగే జనసేన కార్యకర్తలకు మెగా ఫ్యామిలీ ఇంకా అల్లు ఫ్యామిలీ లో ఉన్నాయి అనుకున్నారు. అలాగే పుష్ప 2 రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ కావడంతో ఈ సందేహాలు మరియు బలంగా అభిమానులకి వెళ్లాయి. వీటి గురించి బన్నీ వాసు కొన్ని సందర్భాలలో వ్యాఖ్యానించినప్పటికీ ఈ సందేహాలు పూర్తిగా అభిమానులలో కుదుటపడలేదు. అయితే మెగా బ్రదర్ కొణిదల నాగబాబు గారు ఇటీవలే తన సోషల్ మీడియా మాధ్యమం అయినటువంటి ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో ‘Ask a Question’ ద్వారా ఒక విషయం తెలిపారు. అదేంటంటే ఒక అభిమాని అల్లు అర్జున్ గురించి అడగగా కష్టపడి పనిచేసే వ్యక్తి అంటూ అల్లు అర్జున్ గురించి చాలా పాజిటివ్ గా స్పందించారు. అలాగే పుష్ప 2 కోసం తాను కూడా వెయిట్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తద్వారా మెగా ఫ్యామిలీ అలాగే అల్లు ఫ్యామిలీ ల మధ్య ఎటువంటివి విభేదాలు లేనట్లు తెలుస్తుంది.