వైరల్‌గా మారిన మాస్టర్ డిలీటెడ్ సీన్స్

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తలపతి నటించిన మాస్టర్ సినిమా ఇటీవల సంక్రాంతి కానుకగా విడుదలై భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.250 కోట్లకుగా కలెక్షన్లు సాధించింది. లోకేశ్ కనగరాజ్ ఈ సినిమాను తెరకెక్కించగా.. మాళవిక మోహన్ హీరోయిన్‌గా నటించింది. విజయ్ సేతుపతి విలన్‌గా నటించిన విషయం తెలిసిందే.

master delected scenas

ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో మాస్టర్ స్ట్రీమింగ్ అవుతుండటంతో.. థియేటర్లలో తీసివేశారు. అయితే ఈ సినిమాలోని డెలిటెడ్ సీన్స్‌ను తాజాగా అమెజాన్ ప్రైమ్ విడుదల చేసింది. అందులో ఒక సీన్‌లో టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్టు సురేఖావాణి నటించింది. కానీ సినిమా నిడివి ఎక్కవ అవ్వడం వల్లన ఆ సీన్‌ను తీసివేశారు. ఇక క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీని ప్రస్థావిస్తూ. దళపతి విజయ్ రిఫరెన్స్ సీన్.. కాలేజీ స్టూడెంట్స్ ఎపిసోడ్‏కు మంచి కామెంట్స్ వస్తున్నాయి. సినిమా నిడివి ఎక్కువ కావడం వల్లన ఈ సీన్‌ను కూడా తీసివేశారు.