మాస్ మహారాజా రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ నుంచి రెప్పల్ డప్పుల్‌ సాంగ్ రిలీజ్

మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’ మ్యూజిక్ ప్రమోషన్లు ఫస్ట్  సింగిల్ సితార్‌కు అద్భుతమైన రెస్పాన్స్ తో చార్ట్ బస్టర్ నోట్‌లో ప్రారంభమయ్యాయి. ఈ రోజు, మేకర్స్ సెకండ్ సింగిల్ రెప్పల్ డప్పుల్‌ను విడుదల చేశారు, ఇది ఫస్ట్ సింగిల్‌కి చాలా డిఫరెంట్ గా వుంది.

రెప్పల్ డప్పుల్ హైలీ ఎనర్జిటిక్ బీట్‌లతో కూడిన కంప్లీట్ మాస్ నంబర్. మ్యూజిక్ కంపోజిషన్, ట్యూన్ లో ఈ మాస్ నంబర్‌ను మ్యాసీ బ్లాక్‌బస్టర్‌గా మార్చేలా కంపోజ్ చేశారు మిక్కీ జె మేయర్.  ఆర్కెస్ట్రేషన్ అద్భుతంగా వుంది. సింగర్స్ అనురాగ్ కులకర్ణి, మంగ్లీ తమ స్పెషల్ వోలక్స్ తో ఎక్స్ ట్రార్డినరీ గా పాడారు. కాసర్ల శ్యామ్ లిరిక్స్ ఈ ఎలక్ట్రిఫైయింగ్ డ్యాన్స్ నంబర్ బీట్‌లను పెర్ఫెక్ట్ గా మ్యాచ్ చేశాయి. ఇది ప్రతి మాస్ పార్టీ ప్లేలిస్ట్‌లో ఉండబోతోంది. మిస్టర్ బచ్చన్ ఆగస్ట్ 15న విడుదల కానుంది.

 తారాగణం: రవితేజ, భాగ్యశ్రీ బోర్సే, జగపతి బాబు, సచిన్ ఖేడేకర్

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: హరీష్ శంకర్
నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
సమర్పణ: పనోరమా స్టూడియోస్ & T-సిరీస్
సంగీతం: మిక్కీ జె మేయర్
డీవోపీ: అయనంక బోస్
ప్రొడక్షన్ డిజైనర్: బ్రహ్మ కడలి
ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
మేకప్ చీఫ్: ఐ శ్రీనివాసరాజు