మాస్ మహారాజా రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ నుంచి రొమాంటిక్ మెలోడీ జిక్కీ రిలీజ్

మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’ పై ఎక్సయిట్మెంట్ నెక్స్ట్ లెవల్ కి చేరుకుంది. రెండు పాటలు ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి. ఈ రోజు మేకర్స్ థర్డ్ సింగిల్- జిక్కీ సాంగ్ ని రిలీజ్ చేశారు.

మిక్కీ జె మేయర్ తన అద్భుతమైన ఆర్కెస్ట్రేషన్‌తో మెస్మరైజింగ్ నెంబర్ ని కంపోజ్ చేశారు. సాంగ్ లో మోడరన్, క్లాసిక్ టచ్ ని అద్భుతంగా బ్లెండ్ చేశారు. ఈ సాంగ్ వండర్ ఫుల్ మ్యూజికల్ గ్రాండియర్ ని అందిస్తోంది. లిరిక్ రైటర్ వనమాలి పొయిటిక్ డెప్త్ తో ఎమోషన్ ని కంప్లీట్ చేశారు. కార్తీక్, రమ్య బెహరా అందించిన వోకల్స్ టాప్ క్యాలిటీ, మెలోడీ ఇంటర్‌ప్లే సాంగ్ ఎసెన్స్ ని అద్భుతంగా ప్రజెంట్ చేసింది.

విజువల్ గా రవితేజ, భాగ్యశ్రీ బ్యూటీఫుల్ కెమిస్ట్రీని పంచుకుంటారు. భాగ్యశ్రీ తన బ్యూటీ, డైనమిక్ హిప్ మూవ్‌మెంట్‌లతో ఆకట్టుకుంటుంది. ఈ పాటలో విజువల్స్‌ స్టన్నింగ్ గా వున్నాయి. అద్భుతంగా వేసిన  సెట్‌లు, రియల్ కాశ్మీర్ లోకేషన్స్ కట్టిపడేశాయి. కాశ్మీర్ సీనిక్ బ్యూటీ గ్రేట్ అంథంటసిటీ యాడ్ చేసింది. బృందా మాస్టర్ కొరియోగ్రఫీ ఎక్స్ ట్రార్డినరీగా వుంది. ఈ రొమాంటిక్ మెలోడీ నిజంగా మిమ్మల్ని మ్యూజికల్ పారడైజ్ లోకి తీసుకువెళుతుంది.

మిస్టర్ బచ్చన్ ఆగస్టు 15న విడుదల కానుంది.

తారాగణం: రవితేజ, భాగ్యశ్రీ బోర్సే, జగపతి బాబు, సచిన్ ఖేడేకర్, సత్య, నెల్లూరు సుదర్శన్, తదితరులు

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: హరీష్ శంకర్
నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
సమర్పణ: పనోరమా స్టూడియోస్ & T-సిరీస్
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
సంగీతం: మిక్కీ జె మేయర్
డీవోపీ: అయనంక బోస్
ప్రొడక్షన్ డిజైనర్: బ్రహ్మ కడలి
ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
మేకప్ చీఫ్: ఐ శ్రీనివాసరాజు