కామెడీ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న టాలెంటెడ్ దర్శకుడు మారుతి నెక్స్ట్ సినిమాపై ఇంకా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇవ్వలేదు. ప్రస్తుతానికి కథను రెడీ చేసుకున్న ఈ సినియర్ దర్శకుడు సరైన హీరో కోసం వెతుకుతున్నాడు. అయితే ఫైనల్ గా ఇటీవల యూవీ క్రియేషన్స్ ద్వారా ఒక హీరోను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఆ హీరో మరెవరో కాదు. మాస్ మహరాజ్ రవితేజ.
క్రాక్ సినిమాతో కరోనా తరువాత మొదటి బాక్సాఫీస్ హిట్ అందుకోవాలని చూస్తున్న రవితేజ వీర దర్శకుడితో కూడా ఒక సినిమాను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఇక కుదిరితే మారుతి సినిమాను కూడా ఒకేసారి సెట్స్ పైకి తేవాలని ఆలోచిస్తున్నాడట. గతంలోనే వీరి కాంబినేషన్ పై కొన్ని రూమర్స్ వచ్చాయి. ఇక ఫైనల్ గా ఇటీవల సరైన కథ తగలడంతో రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక తన కొత్త సినిమాలో మారుతి, రవితేజను ఒక లయర్ పాత్రలో చూపించబోతున్నారని టాక్.