‘బ్రహ్మా ఆనందం’ నుంచి మాస్ డ్యాన్స్ నంబర్ విడుదల

మళ్ళి రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద వంటి హిట్ చిత్రాలతో స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రేక్షకుల్లో మంచి మార్కులు సంపాదించుకుంది. హ్యాట్రిక్ హిట్ల తరువాత ప్రస్తుతం ఓ సున్నితమైన అంశంతో ‘బ్రహ్మా ఆనందం’ అనే చిత్రంతో అందరినీ ఎంటర్టైన్ చేసేందుకు వస్తోంది. సక్సెస్ ఫుల్ ప్రొడక్షన్ హౌస్‌కి ఇది నాలుగో ప్రాజెక్ట్. ఈ చిత్రంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మానందం, అతని కుమారుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

శ్రీమతి సావిత్రి,శ్రీ ఉమేష్ కుమార్ సమర్పణలో రూపొందించిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు Rvs నిఖిల్ అద్భుతంగా తెరకెక్కించారు. విజయవంతమైన నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా ఈ సినిమాను భారీ ఎత్తున నిర్మించారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 14న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘బ్రహ్మా ఆనందం’ నుంచి ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇక తాజాగా ఈ చిత్రం నుంచి  ఓ మాస్ నంబర్‌ను రిలీజ్ చేశారు. గ్రామాల్లో జాతర అంటే ఎలా ఉంటుందో.. ఆ సందడి ఎలా ఉంటుందో ఈ ‘రెచ్చిపోవాలే’ పాటలో చూపించబోతోన్నారు. శాండిల్య పిసాపాటి బాణీ, శ్రీ సాయి కిరణ్ సాహిత్యం, సింగర్ సాకేత్-శాండిల్య గాత్రం ఈ పాటకు అదనపు ఆకర్షణ. ఇక ఈ పాటలో రాజా గౌతమ్ ఎనర్జిటిక్ స్టెప్పులు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి.

బ్రహ్మా ఆనందం చిత్రాన్ని వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. పొలిమేర 2, కమిటీ కుర్రోళ్లు, క వంటి చిత్రాల తరువాత నంది వంశీ నందిపాటి ఈ మూవీని ఫ్యాన్సీ రేటుకు హక్కుల్ని చేజిక్కించుకున్నారు.

ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, సంపత్ రాజ్, రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో నటించారు. శాండిల్య పిసాపాటి సంగీతం సమకూర్చగా, మితేష్ పర్వతనేని కెమెరా మెన్‌గా, ప్రణీత్ కుమార్ ఎడిటర్‌గా పని చేశారు.

నటీనటులు : రాజా గౌతమ్, “పద్మశ్రీ” బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్, రాజీవ్ కనకాల, సంపత్ రాజ్, రఘు బాబు, ప్రభాకర్, డివిజ ప్రభాకర్, దయానంద్ రెడ్డి తదితరులు

సాంకేతిక బృందం
బ్యానర్: స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్
నిర్మాత: రాహుల్ యాదవ్ నక్కా
దర్శకుడు: Rvs నిఖిల్
DOP: మితేష్ పర్వతనేని
సంగీత దర్శకుడు: శాండిల్య పిసపాటి
ఎడిటర్: ప్రణీత్ కుమార్
ఆర్ట్ డైరెక్టర్: క్రాంతి ప్రియం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: డి.వంశీకృష్ణా రెడ్డి, పి.దయాకర్ రావు  
PRO: వంశీ కాకా