పివిఆర్ మల్టీప్లెకస్ లో ‘మంజుమల్ బాయ్స్’ సినిమా నిలిపివేత

మలయాళం లో గొప్ప విజయం సాధించిన బాయ్స్ తెలుగులో కూడా అంతటి విజయం సాధించింది అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా మంచి కలెక్షన్లతో ఉన్న సమయంలో ఈ సినిమాకి ఓ ఇబ్బంది వచ్చి పడింది. పివిఆర్ మల్టీప్లెక్స్ లో మంజుమల్ బాయ్స్ నిలిపివేశారు. దీనికి కారణం ఇంతకుముందు పాత మలయాళం నిర్మాతలతో ఉన్న వివాదం కారణంగా ఈ చిత్ర ప్రదర్శనను నిలిపివేస్తున్నట్లు పివిఆర్ వెల్లడించింది. దీనితో ఆగ్రహం వచ్చిన మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి పివిఆర్ వారు వారు ఇలా చేయడం న్యాయం కాదని పాతవారితో విభేదాలు ఉంటే ఈ సినిమా నిలిపివేయడం మంచిది కాదంటూ ఇలా చేయడం వల్ల వారికి ఆర్థికంగా ఎంతో నష్టం వచ్చిందని అన్నారు. అలాగే పివిఆర్ వ్యవహార శైలిని తెలుగు ఫిలిం చాంబర్ దృష్టికి తీసుకుని వెళ్లారు. ఈరోజు సాయంత్రం ఫిల్మ్ చాంబర్ మల్టీప్లెక్స్ తీరుపై అత్యవసర సమావేశం కానుంది.