వరల్డ్స్ బిగ్గెస్ట్ ఐటీ స్కామ్ లో మంచు కుర్రాడు

దాదాపు ఏడాది గ్యాప్ తర్వాత మంచు విష్ణు మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చాడు. సరైన హిట్ కోసం చూస్తున్న ఈ మంచు కుర్రాడు, కాజల్ అగర్వాల్ నవదీప్ లతో కలిసి వరల్డ్స్ బిగ్గెస్ట్ ఐటీ స్కామ్ చేయడానికి రెడీ అయ్యాడు. మోసగాళ్లు పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మంచు అభిమానులు కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆ వెయిటింగ్ కి తెరదించుతూ విష్ణు, ఈ మోసగాళ్లు ఫస్ట్ లుక్ ని విక్టరీ వెంకటేష్ తో రిలీజ్ చేయించాడు.

రైజ్ ఆఫ్ మోసగాళ్లు అంటూ బయటకి వచ్చిన ఈ మోషన్ పోస్టర్ ని డాలర్ నోట్ పైన చాలా తెలివిగా డిజైన్ చేశారు. గ్రాఫిక్స్ అండ్ మ్యూజిక్ రిచ్ గా ఉన్నాయ్. ఈ ఐటీ స్కామ్ అమెరికాలో జరిగిందనే విషయం అర్ధం అవుతుంది కానీ ఎవరు చేశారు ఎందుకు చేశారు అనేది తెలియాలి అంటే మంచు విష్ణు మోసగాళ్లని రిలీజ్ చేసే వరకూ ఆగాల్సిందే.