పోలీసులకు స్పందించిన మోహన్ బాబు

కొద్ది రోజులుగా మంచు ఫ్యామిలీలో జరుగుతున్న సంఘటనలు అందరికీ తెలిసినవే. కొన్ని విషయాలపై మంచు మనోజ్, మంచు మోహన్ బాబు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్లు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగా కొన్ని అనుకొని సంఘటనలు జరిగాయి. ఆ సంఘటనలో భాగంగా మోహన్ బాబు గాయపడగా ఆయన ఆసుపత్రిలో చేరడం జరిగింది. అయితే తాజాగా మోహన్ బాబు ఆసుపత్రి నుండి పరారీ అయ్యారని, వారికోసం పోలీసులు తనిఖీ చేస్తున్నారని, అయినా మోహన్ బాబు ఆచూకీ తెలియలేదని కొన్ని వార్తలు వినిపించగా నేడు ఉదయం మోహన్ బాబు వాటిపై స్పందిస్తూ తాను ఎక్కడికి పరారీ కాలేదని, తాను తన ఇంట్లోనే క్షేమంగా ఉండాలని X వేదికగా తెలియజేయడం జరిగింది. తను తన ఇంట్లోనే వైద్యం తీసుకుంటున్నట్లు, మీడియా వారు అసత్యాలను ప్రచారం చేయకూడదు పనికొడుతూ అయినా విన్నపించుకున్నారు. ఇది ఇలా ఉండగా తాను కోలుకున్న తర్వాత విచారణ చేయాలని మోహన్‌బాబు పోలీసులను కోరారు. కాని పోలీసులు ఇప్పుడే మోహన్ బాబును విచారణకు సహకరించాలన్న అన్నారు.మోహన్‌బాబును పోలీసులు ప్రశ్నించగా తన గన్‌ను సరెండర్‌ చేయాలని పోలీసులు కోరారు. అయితే సాయంత్రం తన గన్ ను పోలీసులకు సరెండర్ చేస్తానని మోహన్‌బాబు చెప్పడం జరిగింది.