డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు రెండో కుమారుడు మంచు మనోజ్ మరోసారి పెళ్లిపీటలెక్కనున్నాడా?.. త్వరలోనే మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోనున్నాడా?.. అంటే అవుననే సమాధానాలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మంచు మనోజ్ రెండో పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మెహన్ బాబు కుటుంబానికి చాలా దగ్గర బంధువు అని ప్రచారం జరుగుతోంది.
మే నెలలో ఈ పెళ్లి ఉంటుందని పుకార్లు హల్చల్ చేస్తున్నాయి. గతంలో ప్రణతి అనే అమ్మాయిని మనోజ్ పెళ్లి చేసుకోగా.. గత సంవత్సరం మనస్పర్థల వల్ల విడిపోయారు. పెళ్లి అయిన తర్వాత ప్రణతి అమెరికా వెళ్లి అక్కడే ఉద్యోగం చేస్తుందని, అది మంచు మనోజ్‌కు నచ్చక ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని అప్పట్లో వార్తలొచ్చాయి. ఇక మనోజ్ కూడా సినిమాలతో బిజీగా ఉంది భార్యను పట్టించుకోలేదని, విడిపోవడానికి ఇది కూడా ఒక కారణమని అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు మనోజ్ రెండో పెళ్లి గురించి వస్తున్న వార్తలు ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉ:ది.