Tollywood: నాంది ట్రైల‌ర్‌ను రిలీజ్ చేసిన మ‌హేశ్‌బాబు..

Tollywood: టాలీవుడ్ కామెడీ హీరో అల్లరి న‌రేశ్ న‌టిస్తున్న తాజా చిత్రం నాంది. ఈ చిత్రానికి విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. స‌తీష్ వేగేశ్న ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 19న రిలీజ్ చేస్తున్న‌ట్టు చిత్ర‌బృందం ప్ర‌క‌టించ‌గా.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైల‌ర్‌ను మ‌హేశ్‌బాబు సోష‌ల్ మీడియా వేదిక‌గా రిలీజ్ చేశారు. రాజ‌గోపాల్ గారిని నేను మ‌ర్డ‌ర్ చేయ‌డం ఏంటీ స‌ర్ అంటూ నరేశ్ చెప్పే డైలాగ్‌తో ప్రారంభ‌మైన ఈ ట్రైల‌ర్ ఎంతో ఉద్వేగ‌భ‌రితంగా కొన‌సాగింది.

Naandhi trailer

అలాగే అంద‌రూ నా జీవితం ఇక్క‌డ అయిపోయింది అని అనుకుంటారు.. కానీ ఇప్పుడే మొద‌లైంది… అంటూ డైలాగ్ ఈ ట్రైల‌ర్‌లో న‌రేశ్ ఇర‌గ‌దీశాడు. అయితే ప్ర‌యోగ చిత్రాల‌తో ఆక‌ట్టుకునే న‌రేశ్ ఇప్పుడు డిఫ‌రెంట్ క‌థ‌తో వ‌స్తున్నాడు. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్ లోనే ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేసింది. ఇక క్రైమ్‌, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు సామాజిక అంశాల‌పై వ‌స్తున్న Tollywood ఈ చిత్రంలో ప్ర‌ముఖ న‌టి వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్‌ లాయ‌ర్ పాత్ర‌ను పోషిస్తుంది.