గ్లామర్ తో మరోసారి షాక్ ఇచ్చిన మలైకా అరోరా

గబ్బర్ సింగ్ సినిమాలో కెవ్వు కేక అంటూ తెలుగు ఆడియేన్స్ కి కూడా బాగా దగ్గరైన బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా. ఈ బ్యూటీ లైఫ్ స్టైల్ గురించి అందరికి తెలిసే ఉంటుంది. ఎలాంటి సందర్బల్లో అయినా తనదైన శైలిలో డ్రెస్సింగ్ స్టైల్ తోనే స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది. ఆమె డ్రెస్సింగ్ స్టైల్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేలా ఉంటుంది. ఇక రీసెంట్ గా ఈ బ్యూటీ మరోసారి డిఫరెంట్ లూక్స్ తో ఆకట్టుకుంది.

ఒక షో కోసం మలైకా రెండు అద్భుతమైన దుస్తులను ధరించింది. ఒకటి ఎలక్ట్రిక్ బ్లూ కలర్‌లో, మరొకటి నియాన్ గ్రీన్ లో. హెయిర్ స్టైల్ లో కూడా మలైకా ఎంత డిఫరెంట్ గా ఆలోచిస్తుందో ఈ ఫోటోలను చూస్తే క్లియర్ గా అర్ధమవుతోంది. గతంలో కూడా చాలా సార్లు మలైకా తన అందాలను విభిన్న కోణాల్లో ప్రజెంట్ చేసింది. అయితే ఎప్పటికప్పుడు మళ్ళీ కొత్తగానే ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బహుశా ఈ అందంతోనే ఏమో తన కంటే చిన్నవాడైన అర్జున్ కపూర్ ని ప్రేమలో పడేసింది.