మన సౌత్ ఇండియన్ కమల హారిస్ అమెరికా నెక్స్ట్ ప్రెజిడెంట్?

అవును.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ సందేహం హాట్ టాపిక్ గా మారింది. సౌత్ ఇండియాకు చెందిన ఒక మహిళ అమెరికా అధ్యక్ష పదవి అందుకోవడానికి సిద్ధంగా ఉందా అనే విషయంపై అంతర్జాతీయ మీడియాలలో అనేక రకాల చర్చలు కొనసాగుతున్నాయి. ఇటీవల అమెరికా డొమెస్టిక్ పార్టీ ప్రెజిడెంట్ క్యాండీడేట్ జో బిడెన్ కమల దేవి హారీస్ ని వైజ్ ప్రెజిడెంట్ అభ్యర్థిగా ప్రకటించారు.

కమలా హారీస్ ఎంపిక చేసినందుకు చాలా గర్వంగా ఉందని ఆమె ఒక భయం లేని ఫైటర్ అంటూ పబ్లిక్ సర్వెంట్ గా తప్పకుండా కమలా తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తుందని నమ్మకం తనకి ఉందని జో బిడెన్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఇక కమల హారీస్ విషయానికి వస్తే తమిళనాడుకి చెందిన శ్యామల గోపాలన్ కుమార్తె. ఆమె ఇండియాలో క్యాన్సర్ రిసెర్చర్ గా పని చేశారు.

ఇక ఆమె తండ్రి డోనాల్డ్ హారీస్. ఆయన ఆఫ్రికన్ జమైకన్ ఎకనామిక్ ప్రొఫెసర్. కమల గ్రాండ్ ఫాదర్ పీవీ.గోపాలన్ ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ కూడా. ఇక చిన్నతనం నుంచి తల్లి దండ్రులతోనే అమెరికాలో స్థిరపడిన కమల అక్కడ పొలిటికల్ ఎడ్యుకేషన్ లో మంచి గుర్తింపును అందుకొని ఇప్పుడు అగ్రరాజ్యం భవిష్యత్తు ప్రెజిడెంట్ అయ్యేంతల గుర్తింపు తెచ్చుకున్నారు. మరి ఆమె ఏ స్థాయిలో విజయాలను అందుకుంటుందో తెలియాలి అంటే వచ్చే ఎన్నికల వరకు వెయిట్ చేయాల్సిందే.