సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కలయికలో సినిమా కోసం ఘట్టమనేని అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ మాటని నిజం చేస్తూ ఆర్ ఆర్ ఆర్ తర్వాత రాజమౌలి, మహేశ్ తో బాండ్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడని సమాచారం. 2020 చివరి నాటికి ఈ సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే రాజమౌళి సినిమా అనౌన్స్ అయినా సెట్స్ పైకి వెళ్ళడానికి టైం పడుతుంది కాబట్టి మహేశ్ ఈ గ్యాప్ లో మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.
రాజమౌళి సినిమా అంటే నేషనల్ వైడ్ మార్కెట్ ఉంటుంది. ఆ రేంజ్ సినిమా చేసే లోపు కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తే బాగుంటుందని మహేశ్ భావిస్తున్నాడట. 80 కోట్ల బడ్జట్ తో కేజీఎఫ్ ని తెరకెక్కించి కన్నడ తెలుగు హిందీలో వసూళ్ల వర్షం కురిపించిన ప్రశాంత్ నీల్, మహేశ్ కి ఇప్పటికే కథని కూడా వినిపించాడు. ఘట్టమనేని హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే సినిమా అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే రాజమౌళి లాగే ప్రశాంత్ నీల్ కూడా చాలా లేట్ అండ్ డిటైల్డ్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. సరిలేరు నీకెవ్వరూ జనవరిలో రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత మహేశ్ రెండు నెలలు రెస్ట్ తీసుకోనున్నాడు. దాదాపు ఏప్రిల్ వరకూ మహేశ్ మళ్లీ బయటకి వచ్చే ఛాన్స్ లేదని తెలుస్తోంది. మేలో మహేశ్ కొత్త సినిమా మొదలైనా కూడా కంప్లీట్ అవ్వడానికి మినిమమ్ ఆరు నుంచి 8 నెలల టైం పడుతుంది. జులైలో ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ అయిపోతుంది కాబట్టి మహేశ్ కోసం రాజమౌళి మరో ఆరు నెలలు ఆగాల్సి వస్తుంది. మరి సరిలేరు నీకెవ్వరూ అయిపోయాక ఉండే ఏడాది గ్యాప్ లో మహేశ్, ప్రశాంత్ నీల్ ఎలాంటి ప్రాజెక్ట్ తో బయటకి వస్తారు అనేది చూడాలి.