“ఒక్క‌డు”కి 18ఏళ్లు.. న‌మ్ర‌త ట్వీట్‌పై నిర్మాత ఎంఎస్ రాజు హ‌ర్ట్‌!

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ కాంబినేషన్‌లో తెర‌కెక్కిన చిత్రం ఒక్క‌డు. ఈ సినిమాను ఎంఎస్ రాజు నిర్మించ‌గా… ఈ సినిమా విడుద‌లై శుక్ర‌వారానికి 18ఏళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా మ‌హేశ్ భార్య న‌మ్ర‌తా శిరోద్క‌ర్ ఒక్క‌డు సినిమాను గుర్తు చేసుకుంటూ.. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. మ‌హేష్ సినిమాల్లో ఒక్క‌డు క్లాసిక్ హిట్‌. మ‌ళ్లీ మ‌ళ్లీ చూడ‌ల‌నిపించే సినిమా ఒక్క‌డు త‌న‌కు ఆల్‌టైమ్ ఫేవ‌రెట్ సినిమాని పేర్కొన్నారు.

maheshbabu

అయితే ఈ పోస్ట్‌పై ఒక్క‌డు నిర్మాత ఎం.ఎస్‌. రాజు ఫీల‌య్యాడు. ఎందుకంటే.. న‌మ్ర‌త చేసిన పోస్ట్‌లో చిత్ర‌యూనిట్ స‌భ్యులైన మ‌హేశ్‌, భూమిక‌, గుణ‌శేఖ‌ర్‌, ప్ర‌కాశ్‌రాజ్‌, ఫైట్ మాస్ట‌ర్ విజ‌య‌న్‌, మ‌ణిశ‌ర్మ ఇలా అందరి పేర్ల‌ను ఆ పోస్ట్‌లో న‌మ్ర‌త ప్ర‌స్తావించింది కానీ.. వీరిలో నిర్మాత ఎంఎస్‌. రాజు పేరును మ‌ర్చిపోయింది. తాజాగా ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన నిర్మాత ఎంఎస్‌. రాజు న‌మ్ర‌త ట్వీట్‌పై స్పందించ‌గా.. పొర‌పాట్లు జ‌రుగుతుంటాయి బాబు.. న‌మ్ర‌త గారు ఒక్క‌డు గురించి మాట్లాడుతూ.. నా పేరును మ‌ర్చిపోయారు. అయినా నాకు సంతోష‌మే. ఈ సిన‌మా ఆమెకు ఫెవ‌రేట్ మూవీ అయినందుకు గుడ్‌ల‌క్ అంటూ ట్వీట్ చేసారు ఎంఎస్‌. రాజు. దీంతో సోష‌ల్ మీడియాలో మీరు లేకుండా ఒక్క‌డు సినిమా లేదు సార్.. ఇంత‌టి గొప్ప సినిమాను అందించినందుకు ధ‌న్య‌వాదాలు అంటూ నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు.