హాలీవుడ్ సినిమా రేంజ్ లో మహేష్ బాబు కొత్త యాడ్

Mahesh Babu Mountain Dew New AD | #maheshbabu |  TFPC

ఇండియా, 24 ఫిబ్రవరి 2023 : తమకెదురైన ప్రతి సవాల్‌నూ అధిగమించేలా వినియోగదారులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో మౌంటెన్‌ డ్యూ నేడు, తమ ఉత్సాహపూరితమైన వేసవి ప్రచారాన్ని సూపర్‌స్టార్‌ మరియు బ్రాండ్‌ అంబాసిడర్‌ మహేష్‌బాబుతో ప్రారంభించింది. ఆకట్టుకునే రీతిలో ఉద్విగ్నభరితంగా తీర్చిదిద్దిన ఈ చిత్రం, మౌంటెన్‌ డ్యూ సిద్ధాంతం అయిన ‘డర్‌ కే ఆగే జీత్‌ హై’ను కలిగి ఉండటం మాత్రమే కాదు, వినియోగదారులను తమ సీట్లకు అతుక్కుపోయేలా చేస్తుంది. స్ఫూర్తిదాయక కథనం, ఉత్సాహపూరితమైన స్టంట్స్‌ కలిగిన ఈ నూతన టీవీసీ , మౌంటెన్‌ డ్యూ యొక్క సిద్ధాంతం అయిన సవాళ్లు ఎదురైనా జీవితంలో విజయం సాధించాలనే సిద్ధాంతం ముందుకు తీసుకువస్తుంది.
ఈ చిత్రంలో, సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు ఓ టెలివిజన్‌లో ప్రత్యక్ష ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధపడతాడు. గతంలో ఎన్నడూ చూడని రీతిలో ఓ కార్గో విమానం నుంచి ఫ్రీఫాల్‌ స్టంట్‌ చేస్తాడు. అత్యంత ఎత్తులో ఉండటం వల్ల సిబ్బంది అంతా అతను సవాల్‌ను విజయవంతంగా పూర్తి చేస్తాడా లేదా అన్న ఆందోళనలో ఉంటారు. ఈ చిత్రంలో , ప్రతి ఒక్కరికీ తమ సొంత భయాలు ఎలా ఉంటాయో చూపుతారు. అయితే ఆ భయాలను అధిగమించడానికి వారు ఎలాంటి ప్రయత్నాలు చేయడం ద్వారా మిగిలిన వారికి భిన్నంగా ఉంటారనేది తెలుపుతుంది. ఈ సిద్ధాంతానికి అనుగుణంగా, ఈ స్టంట్‌ను ముగించాలనే సంకల్పంతో , మహేష్‌ బాబు మౌంటెన్‌ డ్యూ ఓ గుటక వేయడంతో పాటుగా సాహసానికి సిద్ధమవుతాడు. ఈ చిత్రం ఓ ప్రోత్సాహపూరిత సందేశంతో ముగుస్తుంది. తన ప్రయాణంలో అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ మహేష్‌బాబు తన మోటర్‌సైకిల్‌తో సహా విజయవంతంగా మరో కార్గో ప్లేన్‌లో చేరతాడు.
ఈ ప్రచారం గురించి పెప్సీ కో ఇండియా, మౌంటెన్‌ డ్యూ , కేటగిరి డైరెక్టర్‌ వినీత్‌ శర్మ మాట్లాడుతూ ‘‘మహేష్‌బాబుతో మా అనుబంధం కొనసాగిస్తుండటం పట్ల చాలా ఆనందంగా ఉన్నాము. ఈ వేసవి సీజన్‌ కోసం మా నూతన ప్రచారాన్ని మౌంటెన్‌ డ్యూ కోసం విడుదల చేశాము. ఇది బ్రాండ్‌ యొక్క ‘డర్‌ కే ఆగే జీత్‌ హై’ సిద్ధాంతాన్ని బలోపేతం చేస్తుంది. ఈ చిత్రంలో ప్రతి ఒక్కరినీ భయాలు అధిగమించండి, విజేతలుగా నిలవండి అని ప్రోత్సహిస్తారు. ఈ ప్రచారాన్ని వినియోగదారులతో పాటుగా విభిన్నమైన అభిరుచులు కలిగిన మహేష్‌బాబు అభిమానులను సైతం ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాము. అంతేకాదు, ఇది వారికి ఆత్మవిశ్వాసం కలిగించడంతో పాటుగా మౌంటెన్‌ డ్యూ రుచిని సైతం కోరుకునేలా చేస్తుందని ఆశిస్తున్నాము’’ అని అన్నారు.
ఈ చిత్రం గురించి బ్రాండ్‌ అంబాసిడర్‌ మహేష్‌బాబు మాట్లాడుతూ ‘‘భయాన్ని అధిగమించే ధైర్యం, తెలియని ఉద్వేగం– మౌంటెన్‌ డ్యూ యొక్క వ్యక్తిత్వం ఎప్పుడూ కూడా నాతో ప్రతిధ్వనిస్తుంటాయి. ఈ యాక్షన్‌ ప్యాక్డ్‌ చిత్రం కోసం ఈ టీమ్‌తో మరలా కలవడం చాలా ఆనందంగా ఉంది. దీనిలో యాక్షన్‌ మాత్రమే కాదు ఎడ్వెంచర్‌ కూడా ఉంది’’ అని అన్నారు
స్టూడియో సింపుల్‌ క్రియేటివ్‌ హెడ్‌ మరియు కో–ఫౌండర్‌ స్టూడియో సింపల్‌ సాయినాథ్‌ సారాబన్‌ మాట్లాడుతూ ‘‘విజయం సాధించడానికి ముందు ఒకరు అనుభవించే దుర్భలత్వం యొక్క స్ఫూర్తిని చూపుతూనే దవడ పడిపోయే ప్రచారాన్ని సృష్టించడం మా లక్ష్యం. మీరు దీనిలో అధిక ఆక్టేన్‌ డ్రామాను చూస్తారు. అదే సమయంలో మానవతను చూపుతూనే ప్రతి ఒక్కరికీ దగ్గరగా ఉంటుంది’’ అని అన్నారు.
నూతన మౌంటెన్‌ డ్యూ ప్రచారం మరియు టీవీసీ ని టీవీ, డిజిటల్‌, ఔట్‌డోర్‌, సోషల్‌ మీడియా వ్యాప్తంగా సమగ్రంగా ప్రచారం చేయనున్నారు. మౌంటెన్‌ డ్యూ ఇప్పుడు సింగిల్‌/మల్టీ సర్వ్‌ ప్యాక్‌లో ఆధునిక, సంప్రదాయ రిటైల్‌ ఔట్‌లెట్ల వ్యాప్తంగా మరియు సుప్రసిద్ధ ఈ–కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ల వద్ద లభ్యమవుతుంది.