మహేష్ బాబు, Jr ఎన్టీఆర్ మల్టీస్టారర్.. భారీ బడ్జెట్ తో మెగా ప్రొడ్యూసర్ ప్లాన్?

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలోమల్టీస్టారర్ అనే గాసిప్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి స్టార్స్ మల్టీస్టారర్ సినిమాలను చేసి అభిమానులకు మంచి కిక్కిచ్చారు. ఇక నెక్స్ట్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

అసలు మ్యాటర్ లోకి వస్తే.. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ త్వరలోనే మరో బిగ్ బడ్జెట్ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేయనున్నారని ఒక టాక్ వస్తోంది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో రానున్న ఆ సినిమాకు దాదాపు 500కోట్ల బడ్జెట్ పెట్టడానికైనా రెడీగా ఉన్నారట. మంచి కథ కోసం నిర్మాత ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. మహేష్, తారక్ కాంబినేషన్ అంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.