ఎపిక్‌ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచిన సూపర్‌స్టార్‌ మహేష్‌ ‘మహర్షి’

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో.. వైజయంతి మూవీస్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పి.వి.పి సినిమా పతాకాలపై హై టెక్నికల్‌ వేల్యూస్‌తోపాటు పవర్‌ఫుల్‌ సోషల్‌ మెసేజ్‌తో రూపొందిన భారీ చిత్రం ‘మహర్షి’. సూపర్‌స్టార్‌ మహేష్‌కు ఇది 25వ చిత్రం కావడం విశేషం. ఈ చిత్రం మే 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ అయి టెర్రిఫిక్‌ కలెక్షన్స్‌తో తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో 24.6 కోట్ల షేర్‌ వసూలు చేసి ఎపిక్‌ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఈ సందర్భంగా మే 10 (శుక్రవారం) చిత్ర యూనిట్‌ కేక్‌ కట్‌ చేసి సెలబ్రేట్‌ చేసుకుంది. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో…

హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌ రాజు మాట్లాడుతూ – ”మహర్షి’ మే 9న రిలీజై మహేష్‌బాబు కెరీర్‌లో హయ్యస్ట్‌ రెవెన్యూ కలెక్ట్‌ చేసింది. ఇది ముందుగా ఎక్స్‌పెక్ట్‌ చేసిందే. మొదటి రోజు సినిమాని చూసి మహేష్‌బాబు కెరీర్‌లోనే హయ్యస్ట్‌ రెవెన్యూ ఇచ్చిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీడియావారు కూడా సినిమాతో కనెక్ట్‌ అయినందుకు వారికి ధన్యవాదాలు. నైజాంలో నాన్‌ బాహుబలి రెవెన్యూ వచ్చింది. దాదాపు అన్ని చోట్ల అదే పరిస్థితి ఉంది. ఓవరాల్‌గా మహేష్‌బాబుగారి కెరీర్‌లో ల్యాండ్‌ మార్క్‌ మూవీ అవబోతుంది. ఈరోజు కూడా నెల్లూరులో 9 థియేటర్స్‌ ఉంటే అన్నీ ఫుల్స్‌ అయ్యాయి. ఈ సినిమా కమర్షియల్‌గా నెక్స్‌ట్‌ లెవెల్‌కి వెళ్ళబోతుంది అనడానికి ఇదొక నిదర్శనం. ఈ సమ్మర్‌లో, తెలుగు ఇండస్ట్రీలో టాప్‌ గ్రాసర్‌గా నిలుస్తుందనుకుంటున్నాను. ‘మహర్షి’ టీమ్‌ మొత్తానికి కంగ్రాట్స్‌” అన్నారు.

దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ – ”మహర్షి’ చిత్రానికి ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ థాంక్స్‌. ఇదొక హార్ట్‌ హిట్టింగ్‌ ఫిల్మ్‌. ప్రతి ఒక్కరి మనసులోకి వెళ్ళి ఒక మంచి ఆలోచనను సృష్టిస్తుంది. మా సినిమాకి ఫస్ట్‌నుండి సహకరించిన మీడియాకి ధన్యవాదాలు. ఈ విజయం నా రాబోయే చిత్రాలకు పాజిటివ్‌ ఎనర్జీని ఇస్తుంది. ఈ సినిమాతో నాకు ఫస్ట్‌టైమ్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ కాల్‌ చేసి అభినందిస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ ఫోన్‌ చేసి వారు సినిమాలో ఏయే అంశాలకు కనెక్ట్‌ అయ్యారో చెబుతున్నారు. ఇదొక థాట్‌ ప్రొవోక్‌ సినిమా. ఇంటర్నల్‌గా మనం వెతుక్కునే సక్సెస్‌, అలాగే ఎక్స్‌టర్నల్‌గా ఒక సమాజానికి ఎలా ఉపయోగపడాలి అని రెండు పాయింట్లు చెప్పాం. ఏలూరు నుంచి ఎల్‌విఆర్‌గానీ, నెల్లూరు నుండి హరిగారుగానీ వీళ్లందరూ ఫోన్‌ చేసి థియేటర్ల సంఖ్య పెంచాం అని చెప్పారు. మహిళా ప్రేక్షకుల నుండి కూడా అప్రిషియేషన్‌ వస్తోంది. మహేష్‌ మొదటి నుండి ఈ సినిమాపై పెట్టుకున్న నమ్మకాన్ని ప్రేక్షకులు, ఆయన ఫ్యాన్స్‌ నిజం చేశారు. నిన్న మా టీమ్‌ అంతా సుదర్శన్‌ 35 థియేటర్‌లో సినిమా చూశాం. ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ థాంక్స్‌. ఇండస్ట్రీ నుండి ఎన్నో కాల్స్‌ వస్తున్నాయి. మోస్ట్‌ స్పెషల్‌ కాల్‌ చిరంజీవిగారిది. పొద్దున కూర్చుని ఫోన్‌ చూస్తుంటే ఒక నెంబర్‌ వస్తోంది. ఎవరా అని లిఫ్ట్‌ చేస్తే.. ‘వంశీ’ అన్నారు. ఎవరండీ అనగానే… ‘నేను చిరంజీవిని మాట్లాడుతున్నాను’ అన్నారాయన. అది వినగానే గూస్‌ బంప్స్‌ వచ్చాయి నాకు. మే 9న చిరంజీవిగారి ‘జగదేకవీరుడు’ సినిమా రిలీజైన రోజు నుండి నాకు సినిమాలపై ప్యాషన్‌ మొదలైంది. అదే డేట్‌న ‘మహర్షి’ రిలీజ్‌ అవ్వడం, అశ్వనీదత్‌గారు కూడా ఈ సినిమాతో అసోసియేట్‌ అవ్వడం మర్చిపోలేనిది. సినిమా గురించి 5 నిమిషాలు మాట్లాడారు. ఇది నా జీవితంలో ఓ మెమొరబుల్‌ మూమెంట్‌. ఆయన సినిమాలోని ప్రతి ఒక్క పాయింట్‌ గురించి మాట్లాడుతుంటే.. చాలా సంతోషమేసింది. అలాగే నేను వినయ్‌గారి ‘ఆది’ సినిమా చూసి సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ వదిలేసి ఇండస్ట్రీకి వచ్చాను. అలా నా కెరీర్‌లో ఒక ఇంపార్టెంట్‌ పర్సన్‌ అయిన వినాయక్‌గారు ఫోన్‌ చేసి అభినందించడం కూడా ఒక హై పాయింట్‌. ఒక మంచి సినిమా తీసినప్పుడు ఇండస్ట్రీ మొత్తం మా వెన్నంటి ఉందటం అనేది గర్వించదగ్గది. ” అన్నారు.

maharshi

హీరోయిన్‌ పూజా హెగ్డే మాట్లాడుతూ – ”మహర్షి’ సినిమాని సక్సెస్‌ చేసిన తెలుగు ఆడియన్స్‌ అందరికీ ధన్యవాదాలు. మహేష్‌గారి ల్యాండ్‌ మార్క్‌ ఫిల్మ్‌లో నేను కూడా భాగమైనందుకు హ్యాపీగా ఉంది. థియేటర్‌లో ‘పాలపిట్ట’ సాంగ్‌కి స్క్రీన్‌ కనపడకుండా పేపర్స్‌ వేయడం చాలా థ్రిల్లింగ్‌గా అన్పించింది. నన్ను సపోర్ట్‌ చేస్తున్న మీడియాకి ధన్యవాదాలు” అన్నారు.

రాక్‌స్టార్‌ దేవిశ్రీప్రసాద్‌ మాట్లాడుతూ – ”కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉంటూనే, మంచి హార్ట్‌ టచ్చింగ్‌ మూవీని అందించిన వంశీ పైడిపల్లిని అభినందిస్తున్నాను. అలాగే మహేష్‌గారు కమర్షియల్‌ ఎంటర్‌టైనర్స్‌తో పాటు సోషల్‌ మెసేజ్‌ ఉన్న సినిమా చేయడం నిజంగా చాలా గ్రేట్‌. ప్రొడ్యూసర్ల ప్యాషన్‌ సినిమాని నెక్స్‌ట్‌ లెవెల్‌కి తీసుకెళ్ళింది. చిరంజీవిగారు ఫోన్‌ చేసి సినిమా ఎక్స్‌ట్రార్డినరీగా ఉందని పాయింట్‌ టు పాయింట్‌ చెప్పారు. చిరంజీవిగారికి మా అందరి తరపున థాంక్స్‌. మహేష్‌గారి 25వ సినిమా ‘మహర్షి’, అలాగే ఎన్టీఆర్‌గారి 25వ సినిమా ‘నాన్నకు ప్రేమతో’, సూర్య 25వ సినిమా ‘సింగం’ చిరంజీవిగారి 150వ సినిమా ‘ఖైది నెంబర్‌ 150’ ఇలా.. వీళ్లందరి ల్యాండ్‌ మార్క్‌ ఫిలింస్‌లో భాగమైనందుకు గౌరవంగా భావిస్తున్నాను. ఈ సినిమాతో పూజాకి ఫ్యాన్స్‌ పెరిగారు.”

‘మహర్షి’ సినిమా సూపర్‌హిట్‌ అయిన సందర్భంగా చిత్ర యూనిట్‌ బాణసంచా కాల్చి మీడియాతో తమ అనందాన్ని పంచుకున్నారు.