వివాహం చేసుకున్న మహానటి కీర్తి సురేష్

నటి కీర్తి సురేష్ తన స్నేహితుడు ఆంటోనీ తాటిల్ తో రిలేషన్ లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే కొద్ది రోజులుగా వారిద్దరూ అతి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు వాటిని నిజం చేస్తూ ఆమె తన స్నేహితుడు ఆంటోనీ తాటిల్ ను వివాహం చేసుకున్నారు. ఈరోజు ఉదయం గోవాలో వారు ఇరువురు కొంతమంది కుటుంబ సభ్యుల సమక్షంలో డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. సుమారు 15 సంవత్సరాలుగా వారు రిలేషన్ లో ఉండి ఇప్పుడు వివాహ బంధంలోకి అడుగుపెట్టడం జరిగింది. తమ పెళ్లి ఫోటోలను కీర్తి సురేష్ తన సోషల్ మీడియా ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేయడంతో ఫ్యాన్స్ అంతా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

For More Pics, Click Here – https://photos.tfpc.in/actress-keerthy-suresh-pics-from-her-wedding-at-goa/29171/