‘లూసీఫర్’ రీమేక్‌కు టైటిల్ ఫిక్స్

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్నాడు. దీని తర్వాత మలయాళ రీమేక్ ‘లూసిఫర్’ సినిమాలో నటించే అవకాశముంది. మలయాళంలో మోహన్‌లాల్ హీరోగా వచ్చిన ‘లూసీఫర్’ సినిమా అక్కడ సూపర్‌హిట్‌గా నిలిచింది. దీంతో దీనిని తెలుగులోకి రీమేక్ చేయాలని చిరంజీవి ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే లూసీఫర్ తెలుగు రీమేక్ హక్కులను రాంచరణ్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్వీ ప్రసాద్‌తో కలిసి రాంచరణ్ ఈ సినిమాను నిర్మించనున్నాడు.

lusifar

అయితే ఈ సినిమాను ఎవరు నిర్మిస్తాడనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ముందుగా సాహో డైరెక్టర్ సుజీత్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తాడనే ప్రచారం జరిగింది. ఈ ప్రాజెక్ట్ నుంచి సుజీత్ తప్పుకోవడంతో వి.వి వినాయక్ చేతుల్లోకి వెళ్లింది. ఇక వినాయక్ కూడా తప్పుకోవడంతో తమిళ డైరెక్టర్ మోహన్ రాజాకి అప్పగించినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం బయటపడింది.

ఈ సినిమాకు బైరెడ్డి అనే టైటిల్ పెట్టినట్లు సమాచారం. ఇందులో హీరోను రెండు పేర్లతో పిలుస్తారట. అందులో ఒక పేరు బైరెడ్డి అని తెలుస్తోంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కించనున్నారని సమాచారం. చిరు ఇందులో పొలిటీషియన్‌గా కనిపించనున్నాడట. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతోంది. ఆచార్య సినిమా పూర్తైన తర్వాత చిరు లూసీఫర్ సినిమాలో నటించనున్నాడు.