బాలీవుడ్ హీరో, హీరోయిన్, డైరెక్టర్‌కు కరోనా

బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, సీనియర్ హీరోయిన్ నీతూకపూర్, డైరెక్టర్ రాజ్ మెహతాలలకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. దీంతో వారి కాంబినేషన్‌లో వస్తున్న జగ్ జగ్ జీయో సినిమా షూటింగ్‌ను నిలిపివేసినట్లు సమాచారం. గత కొద్దిరోజులుగా చండీగఢ్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. అయితే ఈ షూటింగ్‌లో పాల్గొన్న సీనియర్ హీరో అనిల్ కపూర్‌కు కరోనా నెగిటివ్‌గా నిర్ధారణ అయింది.

corona

హీరో వరుణ్ ధావన్, హీరోయిన్ నీతూకపూర్, డైరెక్టర్ రాజ్ కోలుకున్న తర్వాత తిరిగి షూటింగ్స్ ప్రారంభమవుతుందని బాలీవుడ్ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది. అయితే తమకు కరోనా సోకినట్లు వస్తున్న వార్తలపై ఇప్పటివరకు ఎవరూ స్పందించలేదు. అటు సినిమా యూనిట్ నుంచి కూడా ఎలాంటి ప్రకటన రాలేదు. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. నీతూకపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

కరణ్ జోహర్ సంస్థ అయిన ధర్మ ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. మనీష్ పాల్ ప్రజక్త కోలి ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ గత నెలలో విడుదలైన విషయం తెలిసిందే.