లవ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ “ఆకాశ వీధుల్లో” మూవీ రివ్యూ

సినిమా : ఆకాశ వీధుల్లో
నటీనటులు : గౌతమ్ కృష్ణ, పూజిత పొన్నాడ, దేవి ప్రసాద్, బాల పరాశర్, సత్యం రాజేష్, శ్రీకాంత్ అయ్యంగార్, హర్షిత గౌర్ తదితరులు ..

ఈ చిత్రానికి
సాహిత్యం : చైతన్య ప్రసాద్, శ్రేష్ట, రాకేందు మౌళి, సింగర్స్ : సిద్ శ్రీరామ్, చిన్మయి శ్రీ పాద, రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ, డోప్ డాడీ.
సంగీతం : జూడా శాండీ,
కెమెరా : విశ్వనాధ్ రెడ్డి,
ఫైట్స్ : డ్రాగన్ ప్రకాష్,
సౌండ్ మిక్సింగ్ : కన్నన్ గణపతి,
నిర్మాతలు : మనోజ్ జెడి , డా. డీజే మణికంఠ
రచన, దర్శకత్వం : గౌతమ్ కృష్ణ

గౌతమ్‌ కృష్ణ, పూజితా పొన్నాడ జంటగా నటించిన చిత్రం ‘ఆకాశ వీధుల్లో’. గౌతమ్‌ కృష్ణ దర్శకుడిగా, హీరోగా పరిచయం అవుతోన్న ఈ చిత్రాన్ని మనోజ్‌ జేడీ, డా. డీజే మణికంఠ నిర్మిస్తున్నారు. జూడా శాండీ ఈ సినిమాకు మ్యూజిక్‌ డైరెక్టర్‌. ఈ సినిమా నుండి విడుదలైన పాటలకు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి సెప్టెంబర్ 2న గ్రాండ్ గా థియేటర్స్ లలో విడుదలైన “ఆకాశ వీధుల్లో” సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఎంటర్టైన్ చేసిందో థియేటర్ లో చూద్దాం పదండి

కథ

ఈ తరం యువత ఎదిగి ఒక వ‌య‌స్సు వ‌చ్చిన‌ వారికి చెందిన‌ యంగ్‌స్ట‌ర్స్ అంద‌రి క‌థ‌.మ‌న‌లో మ‌న‌కు జ‌రిగే సంఘ‌ర్ష‌ణను, కుటుంబంలోని యాత్ ఆలోచ‌న‌లు ఎలా వుంటాయి అనేది పెద్ద‌లు గ్ర‌హించేట్లుగా చూపించారు.

దేవి ప్రసాద్ , సంధ్యల (బాల పరాశర్) కొడుకైన సిద్దు (గౌతమ్ కృష్ణ) చదువులో వెనుక బడుతుందడంతో సిద్దుతో తండ్రి దేవీ ప్రసాద్ మనది సాధారణ కుటుంబం.నువ్వు చదువుకుంటేనే నీకు వ్యాల్యూ ఇస్తారు. చదువుకోవాలని చెపుతూ ఉంటాడు. అయితే ఒక రోజు సిద్దు తన తండ్రితో నాకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ ఉంది.నేను మ్యూజిక్ మీద కాన్సెంట్రేట్ చేస్తాను అంటాడు. దాంతో ఎంతో ఇష్టంగా దగ్గరుండి తయారు చేయించుకొన్న సిద్దు గిటార్ పగలగొడతాడు తన తండ్రి..ఆ తరువాత ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతాడు. అక్కడ చాలా మంది అమ్మాయిలను చూసినా కలగని ఇష్టం నిషా( పూజితా పొన్నాడ )ను చూసి ఇష్టపడతాడు.కొన్నాళ్ళ తర్వాత నిషా తో మనం లివింగ్ లో ఉందామని చెపుతాడు సిద్దు దాంతో లవ్ రిలేషన్స్ మీద నమ్మకం లేదు అంటుంది నిషా..ఇలా తన మాటను కాదన్న ప్రతి సారి సిద్దు డ్రింక్ చేస్తూ డ్రగ్స్ కు అలవాటు పడతాడు. ఎంత చెప్పినా వినని సిద్దుతో విసిగిపోయిన నిషా నువ్వు నన్ను సిన్సియర్ గా లవ్ చేసుంటే నా జోలికి రాకు అని బ్రేకప్ చెప్పి వెళుతుంది. దాంతో సిద్దు మరింత డ్రింకర్ గా,డ్రగ్ ఎడిక్టర్ గా మారాతాడు. దాంతో ఫ్రెండ్స్ అందరూ నువ్వు ఇలా ఉంటే రాక్ స్టార్ అవ్వాలనే కలను ఎలా నేర్చుకొంటావు అంటారు .ఎవరు ఎన్ని చెప్పినా వినని పరిస్థితుల్లో ఉన్న సిద్దు తన గర్ల్ ఫ్రెండ్ నిషా ప్రేమను తిరిగి పొందగలిగాడా లేదా? రిషి ఎలా నెరవేర్చు కొన్నాడు? సామాన్యుడైన టీనేజ్ అబ్బాయి సిద్దు రాక్ స్టార్ ఎలా అయ్యాడు? అనేది తెలుసు కోవాలంటే థియేటర్ కు వెళ్లి సినిమా చూడాల్సిందే?

నటీ నటుల పనితీరు
సిద్దు (గౌతమ్ కృష్ణ )కు ఇది మొదటి సినిమా అయినా సీనియర్ యాక్టర్ చాలాచాక్కగా నటించాడు. అటు రొమాంటిక్ పాత్రలో, ఇటు రాక్ స్టార్ పాత్రలో రెండు షేడ్స్ వున్న పాత్రలలో చాలా చక్కగా ఒదిగిపోయాడు. నిషా (పూజిత పొన్నాడ)తన లుక్స్ తో పాటు రొమాంటిక్ సీన్స్ లలో యూత్ ను ఆకట్టుకుంటుంది. స్క్రీన్ పై సిద్దు, నిషాల కెమిస్ట్రీ బాగా పండింది. సిద్దు తండ్రిగా దేవి ప్రసాద్ సాధారణ మధ్య తరగతి తండ్రి గా చాలా బాగా యాక్ట్ చేశాడు.నిషా తండ్రిగా శ్రీకాంత్ అయ్యంగార్ బాగా యాక్ట్ చేశారు.సిద్దుకు తల్లిగా నటించిన సంధ్య (బాల పరాశర్), చెల్లి గా నటించిన సిందు (దివ్య నార్ని) లు సెంటిమెంట్ పాత్రలను బాగా పండించారు. ఫ్రెండ్స్ పాత్రలో నటించిన ఆనంద్ (రిషి),సత్యం రాజేష్ లు తన నటనతో ఆకట్టుకున్నారు . మీర్జాపూర్ ఫెమ్ హర్షిత గౌర్ స్పెషల్ అప్పిరియన్స్ గా అలరించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు
ప్రస్తుత యంగ్‌స్ట‌ర్స్ ఎలా ఉంటున్నారు వారి ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి. మనలో మనకు జరిగే సంఘ‌ర్ష‌ణ ఎలా ఉంటుంది.,కుటుంబంలోని పెద్దల ఆలోచ‌న‌లు ఎలా వుంటాయి అనే కొత్త కాన్సెప్ట్ తో దర్శకుడు గౌతమ్ కృష్ణ చాలా చక్కగా తెరకెక్కించాడు. కథ, కథనం, సంభాషణలు, గీత రచన ఇవన్నీ చక్కగా కుదిరేలా బాగా రాసుకున్నాడు.ఈ సినిమాకు నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణ అని చెప్పవచ్చు.జూడా శాండీ చక్కటి మ్యూజిక్ ఇచ్చారు. ‘శిలగా ఇలా నేనే మిగిలానుగా.. జతగా నువ్వు లేని ఏకాకిగా..’ అనే పాటకు చైతన్య ప్రసాద్‌ లిరిక్స్‌ అందించగా, సింగర్‌ కాల భైరవ చాలా బాగా పాడారు.ఇంకా సిద్ శ్రీరామ్ పాడిన అయ్యొయ్యో అనే పాట యువత ను ఆకట్టుకొనేలా ఉంది.ఇందులో రాహుల్ సిప్లిగంజ్, రాహుల్ రామకృష్ణ, చిన్మయిలు పాడిన పాటలు బాగున్నాయి. చైతన్య ప్రసాద్, శ్రేష్ట, రాకేందు మౌళి ఈ సినిమా పాటలకు మంచి సాహిత్యాన్ని అందించారు. విశ్వనాధ్ రెడ్డి, సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి హైలెట్ గా నిలుస్తుంది. శశాంక్ నాగరాజు ఎడిటింగ్ బాగుంది , .డ్రాగన్ ప్రకాష్ ఫైట్స్ రియలిస్టిక్ ఉన్నాయి.. నిర్మాతలు మనోజ్‌ జేడీ, డా. డీజే మణికంఠ లు ఖర్చుకు వెనకాడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫ్యామిలీ అందరూ వచ్చి చూసే విధంగా ఈసినిమా ఉంటుంది.”ఆకాశ వీధుల్లో” సినిమాను అన్ని వ‌య‌స్సుల‌వారిని కచ్చితంగా ఎంట‌ర్ టైన్ చేస్తుంది అని చెప్పవచ్చు.