‘లవ్ మీ’ రిలేస్ డేట్ ప్రకటన

బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య, ఆశిష్ జంటగా నటిస్తున్న లవ్ & హారర్ మూవీ లవ్ మీ. ఇప్పటికే విడుదల అయినా ఈ సినిమా టీజర్ ఇంకా పాటలు మంచి స్పందన పొందాయి. అయితే ఈ సినిమాలోని ఓ పాటను వైష్ణవి చైతన్య పాడటం విశేషం. లవ్ స్టోరీలు, హారర్ స్టోరీ లు వస్తుంటాయి. ఈ రెండు కంబినేషన్లో వచ్చే చిత్రాలు చాలా తక్కువ. ఈ జోనర్ లో వచ్చిన ఈ కాలం చిత్రం లవ్ మీ. ఈ నేపథ్యంలో మేకర్స్ సినిమా మే 25న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటిస్తూ పోస్టర్‌ను విడుదల చేశారు.

రానున్న వేసవిలో వెన్నులో వణుకు పుట్టించేలా ఓ ఆత్మ ప్రేమకథతో బ్లాక్ బస్టర్ సాధిస్తామని దర్శక, నిర్మాతలు కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచుతున్నారు. ఆశిష్, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి స్టార్ సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించగా, అవినాష్ కొల్ల ఆర్ట్, ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందించారు.