నాని హీరోయిన్స్ చాలా స్పెషల్ గురు…

రీసెంట్ గా నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చి మంచి టాక్ తో ప్రేక్షకులని మెప్పిస్తుంది. ఈ మూవీతో హీరోయిన్ గా పరిచయం అయిన అమ్మాయి ప్రియాంక అరుళ్ మోహన్, గ్యాంగ్ లీడర్ చూశాక ప్రెసెంట్ యూత్ అంతా సోషల్ మీడియాలో ప్రియాంక జపం చేస్తున్నారు. టాలెంటెడ్ అండ్ బ్యూటీ అంటూ కాంప్లిమెంట్స్ కూడా ఇస్తున్నారు, నిజానికి నాని టాలెంట్ ఉన్న హీరోయిన్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం ఇదే మొదటిసారి కాదు. నాని సినిమాలతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్స్ లిస్ట్ ఒకసారి చూద్దాం.

 1. అష్టా చెమ్మా – కలర్స్ స్వాతి
 2. ఆలా మొదలైంది – నిత్యా మీనన్
 3. జెండా పై కపిరాజు – రాగిణి
 4. ఎవడే సుబ్రహ్మణ్యం – మాళవిక నాయర్
 5. కృష్ణ గాడి వీర ప్రేమ గాధ – మెహరీన్
 6. జెంటిల్ మెన్ – నివేద థామస్
 7. మజ్ను – అను ఇమ్మాన్యుయేల్
 8. జెర్సీ – శ్రద్ద శ్రీనాథ్
 9. గ్యాంగ్ లీడర్ – ప్రియాంక
  వీరిలో కలర్స్ స్వాతి, నిత్య మీనన్, మాళవిక నాయర్, నివేద, శ్రద్ధ శ్రీనాధ్, ఇప్పుడు లేటెస్ట్ గా ప్రియాంక… ఒక రొమాంటిక్ సీన్ లేకుండా, ఎక్స్పోజ్ చేయకుండా, కేవలం కథని నమ్మి మాత్రమే సినిమాలు చేస్తూ అన్ని ఇండస్ట్రీల ప్రేక్షకులని మెప్పిస్తున్నారు. పాతిక సినిమాల్లో 9 మంది హీరోయిన్స్ ని పరిచయం చేశాడు. సో నాని చేసే సినిమాల్లాగే, అతను పరిచయం చేసిన అమ్మాయిలు కూడా మంచి టాలెంటెడ్. ముందు ముందు నాని ఇంకెలాంటి హీరోయిన్స్ ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తాడేమో చూడాలి.