డ్రగ్స్ కేసు లో పలువురు సెలెబ్రిటీలు

రాడిసన్ హోటల్ డ్రగ్స్ పార్టీ కేసులో ఓ యూట్యూబ్ నటి పేరు తెరపైకి వచ్చింది. యూట్యూబర్, షార్ట్ ఫిల్మ్స్లో నటించిన కల్లపు లిషి గణేశ్ను పోలీసులు నిందితురాలిగా చేర్చినట్లు తెలుస్తోంది. BJP నేత గజ్జల వివేకానంద ఈ డ్రగ్స్ పార్టీ ఇవ్వగా లిషి కూడా వెళ్లిందని, ఆమెను విచారించనున్నట్లు సమాచారం. 2022లో మింక్ పబ్లో డ్రగ్స్ కేసులోనూ లిషితో పాటు ఆమె సోదరి కుషిత కల్లపు పేర్లు ప్రముఖంగా వినిపించాయి. సినీనటి లిషిగణేష్‌, శ్వేతా పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. వీళ్ళు యూట్యూబ్ లో కూడా ఫేమస్. అయితే పోలీసులు లిషిగణేష్ ను పిలిచి విచారిస్తున్నట్లు సమాచారం.

గతంలో కుషిత ఓ పబ్ లో పట్టుబడగా పోలీసులకు తాను బజ్జిలు తినడానికి వెళ్లినట్లు, అక్కడ డ్రగ్స్ ఉంటాయనే సంగతి తనకి తెలియనట్లు చెప్పింది. అయితే ఇప్పుడు తన సోదరి మరోసారి డ్రగ్స్ కేసులో పట్టుబడ్డారు.