3డి దెయ్యం లీసాకి సెన్సార్ ప్ర‌శంస‌లు

దెయ్యాల కథలతో తెలుగులో ఎన్నో సినిమాలు వచ్చాయి. మెజారిటీ సినిమాలు విజయాలు సాధించాయి. హారర్ జోనర్ లో దెయ్యం కాన్సెప్ట్ బిగ్ సక్సెస్ ఫార్ములా. ఇప్పుడు అదే ఫార్ములాతో వస్తోంది లీసా. దెయ్యాల్ని లైవ్ 3డిలో చూడబోయే త్రీడీ చిత్రం సెన్సార్ పూర్తి ఈ నెల 24న విడుదల ఇది రెగ్యులర్ దెయ్యం కాదు.. ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించే 3డి దెయ్యం ఇది. థియేటర్లలో ధడధడ లాడిస్తుంది. ప్రేక్షకుడికి గజగజను పరిచయం చేసే అరుదైన దెయ్యం ఇది. ది బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్.. సౌండ్ ఎఫెక్ట్స్ .. అందుకు తోడు 3డి విజువల్స్ ఆద్యంతం థియేటర్లలో ఆడియెన్ ని గగుర్పాటుకు గురి చేయడం ఖాయం. లీసా 3డి రెగ్యులర్ సినిమా అని భావిస్తే పప్పులో కాలేసినట్టేనని సమర్పకుడు వీరేష్ కాసాని అంటున్నారు. ఈనెల 24న థియేటర్లలోకి వస్తోంది బూచమ్మ.. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు.. పక్కా కాన్ఫిడెన్స్ అని తాజాగా ప్రీవిజువల్స్ చూసి చెబుతున్నారాయన.

అన్ని పనులు పూర్తయ్యాయి. 24 న థియేటర్లలోకి వస్తోందని నిర్మాత సురేష్ కొండేటి తెలిపారు. ఇండస్ట్రీ బెస్ట్ హారర్ చిత్రం చూడబోతున్నాం. ఈ సినిమా రాకపై ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నాం. జర్నీ.. షాపింగ్ మాల్.. లాంటి సినిమాలు యూనిక్ స్టైల్ లో కొత్త కంటెంట్ తో వచ్చిన సినిమాల్ని మా ఎస్.కెపిక్చర్స్ లో అందించాం. ఈ సినిమా ఎంపికకు కారణం ఎక్స్ క్లూజివ్ స్టైల్.. గత చిత్రాల్ని మించి వినూత్నమైన అనుభూతిని అందించే చిత్రం అవుతుందన్న నమ్మకంగా ఉన్నాం. ముఖ్యంగా 3డి విజువల్స్ ఫెంటాస్టిక్ అని ప్రశంసలు కురవడం ఖాయం. కథాంశం సింపుల్ గా కనిపించినా ఆద్యంతం గ్రిప్పింగ్ నేరేషన్ తో రక్తి కట్టిస్తుంది.


అమ్మమ్మ తాతయ్య ఇంటికి వెళితే.. అక్కడ దెయ్యం అనుభూతుల గురించి కథలు కథలుగా చెబుతుంటే మనం విని ఎంతో ఎగ్జయిట్ అయ్యేవాళ్లం. ఈ సినిమా చూశాక అంతకుమించి ఎగ్జయిట్ అవుతారు. తిరిగి చిన్నప్పటి ఆత్మల కథలు.. దెయ్యం కథలు గుర్తుకొస్తాయి. కథానాయిక గ్రాండ్ పేరెంట్ ఇంట్లో దెయ్యాల్ని లైవ్ గా చూస్తారు ఈ సినిమాలో. కుర్చీ అంచున కూచుని చూసేంత ఎగ్జయిట్ మెంట్ ప్రతి ఫ్రేమ్ లోనూ ఉంటుంది. బోర్ కొట్టింది.. అన్న ఫీల్ ఆడియెన్ కి కలగనే కలగదు అని తెలిపారు. లీసా 3డి చిత్రానికి రాజు విశ్వనాథం దర్శకత్వం వహించారు. సంతోష్ దయానిధి సంగీతం అందించారు.
అంజలి ప్రధాన పాత్రలో నటిస్తున్న
ఈ చిత్రానికి
సినిమాటోగ్రాఫర్: పి.జి.ముత్తయ్య,
మ్యూజిక్ డైరెక్టర్: సంతోష్ దయానిధి’
ఎడిటర్ :ఎస్ ఎన్ ఫాజిల్,
స్టంట్ మాస్టర్: స్టన్నర్ సామ్,
కోరియోగ్రఫీ: సురేష్,
ఆర్ట్ డైరెక్టర్: వినోద్,
ఈ చిత్రానికి నిర్వహణ : , శ్రీనివాస్ గొండేల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : చంద్రహాస్ ఇప్పలపల్లి, సమర్పణ కాసాని వీరేశ్ , నిర్మాత సురేష్ కొండేటి, కథ-డైరెక్షన్: రాజు విశ్వనాథ్,