మూడు భిన్నమైన పాత్రల్లో ధన్ రాజ్

హాస్యనటులు సాధారణంగా ఒకే పాత్రలో కనిపిస్తుంటారు. మూడు భిన్నమైన తరహాల్లో నటించడం అరుదు. అలాంటి అరుదైన అవకాశం హాస్య నటుడు ధన్ రాజ్ దక్కించుకున్నారు. ఇలా మూడు వైవిధ్యమైన పాత్రల్లో ధన్ రాజ్ నటించిన సినిమా స్వయంవద. లక్ష్మీ చలన చిత్ర పతాకంపై రాజా దూర్వాసుల ఈ చిత్రాన్ని నిర్మించగా…సకుటుంబ ప్రేక్షకులకు నచ్చేలా దర్శకుడు వివేక్ వర్మ రూపొందించారు. ఈ శుక్రవారం ఘనంగా ప్రేక్షకుల ముందుకొస్తోంది స్వయంవద. ఈ సందర్భంగా నటుడు ధన్ రాజ్ మాట్లాడుతూ…చాలా మంచి పాత్రలో నటించాను. నా పాత్ర పేరు గోరింక. ఆద్యంతం సాగుతుంది. మూడు భిన్నమైన పాత్రల్లో నటించాను. ఈ మూడు గెటప్ ల కోసం ఎక్కువ సమయం తీసుకోకుండా ముందుగా అనుకున్న కాల్ షీట్స్ లోనే పూర్తి చేశాం. మంచి కథ, దర్శకుడు వివేక్ వర్మ సినిమాను ఆకట్టుకునేలా తెరకెక్కించారు. ఈ మధ్య కాలంలో నాకు పూర్తిగా సంతృప్తినిచ్చిన పాత్ర ఇది. భయపడుతూ నవ్వించే పాత్ర ఇది. కథానాయకుడికి ఉచిత సలహాలు ఇస్తూ ఉంటాను. అవి తిరగబడే ఫలితాన్ని ఇస్తుంటాయి. స్వయంవద నా పాత్రపైనా ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుంటుంది. ఆమె నుండి తప్పించుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంటాను. పూజారి, మ్యారేజ్ బ్యూరో నడిపే వ్యక్తి, డాన్ ఇలా మూడు భిన్నమైన పాత్రల్లో కనిపిస్తాను. అని చెప్పారు.