బిగ్‌బాస్ నుంచి లాస్య ఔట్?

మరికొద్దిరోజుల్లో ముగియనుండటంతో బిగ్‌బాస్4 రసవత్తరంగా మారింది. కంటెస్టెంట్స్ అందరూ స్ట్రాంగ్‌గా మారి పోటాపోటీగా గేమ్ ఆడుతున్నారు. విన్నర్‌గా నిలవాలనే కసి అందరిలోనూ కనిపిస్తోంది. ఇప్పటికే చాలామంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కాగా.. గేమ్ కీలక దశకు చేరుకున్న క్రమంలో ఇప్పటినుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారనేది చర్చనీయాంశంగా మారింది.

ఈ వారం హౌస్ నుంచి యాంకర్ లాస్య ఎలిమినేట్ కానుందని సమాచారం. ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న అందరికంటే లాస్యకు తక్కువ ఓట్లు పడ్డాయని తెలుస్తోంది. ఈ వారం నామినేషన్స్‌లో యంగ్ హీరో అభిజీత్, సోహైల్, అరియానా, హారిక, మోనాల్, లాస్య ఉన్నారు. ఓటింగ్‌లో ఫస్ట్ ప్లేస్‌లో అభిజీత్ ఉండగా.. సెకండ్ ప్లేస్‌లో సోహైల్, మూడో స్థానంలో అరియానా, నాలుగో స్థానంలో హారిక, ఐదో స్థానంలో మోనాల్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఓటింగ్ పరంగా చివరి స్థానంలో లాస్య ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ వారం లాస్య ఎలిమినేట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. మోనాల్‌కి తక్కువ ఓట్లు పడుతున్నా.. బిగ్‌బాస్ కావాలని సేవ్ చేస్తున్నాడనే విమర్శలు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి. మరి ఈ వారం ఆమె కూడా డేంజర్ జోన్‌లో ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.