రెండో పెళ్లి చేసుకున్న స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి

సినీ డైరెక్టర్ క్రిష్ రెండో పెళ్లి చేసుకున్నారు. కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో గైనకాలజిస్ట్ డా. ప్రీతి చల్లాకు మూడుముళ్లు వేశారు. వీరిద్దరి ఫొటోను సినీవర్గాలు షేర్ చేస్తూ విషెస్ తెలియజేస్తున్నాయి. కాగా, ఈనెల 16న రిసెప్షన్ కూడా ఉంటుందని, దీనికి సినీ ప్రముఖులు హాజరవుతారని సమాచారం. 2016లో మొదటి వివాహం చేసుకున్న క్రిష్ 2018లో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. కృష్ణం వందే జగద్గురుం, వేదం, గౌతమీపుత్ర శాతకర్ణి, ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు, కంచే తడిదర చిత్రాలను క్రిష్ దర్శకత్వం చేయడం జరిగింది.