మరో రెండు భాషల్లోకి ‘క్రాక్’

మాస్ మహారాజా రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని తెరకెక్కించిన క్రాక్ సినిమా ఇటీవల సంక్రాంతి కానుకగా విడుదలై భారీ వసూళ్లు వసూలు చేసిన విషయ తెలిసిందే. రవితేజ ఇందులో పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో నటించగా.. వరలక్ష్మి శరత్‌కుమార్ ఇందులో విలన్‌గా నటించింది. త్వరలో ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ ఆహా యాప్‌లో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. భారీ ధరకు ఈ సినిమా డిజిటల్ రైట్స్ ఆహా కొనుగోలు చేసినట్లు తెలస్తోంది. ఫిబ్రవరి 6న స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.

KRACK RAMIL AND MALAYALAM

తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది. తెలుగులో సూపర్ హిట్ అయిన క్రాక్‌ను మరో రెండు భాషల్లో విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. తమిళం, మలయాళ భాషల్లోకి ఈ సినిమాను డబ్ చేసి రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు.