మెగాస్టార్ చిరంజీవి సైరా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా అనౌన్స్ చేశాడు. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాలో చిరు డ్యూయల్ రోల్ ప్లే చేస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆచార్య గోవింద అనే టైటిల్ కూడా బయటకి రావడంతో చిత్ర యూనిట్, అలర్ట్ అయ్యి అది సినిమా పేరు కాదు కాస్త ఓపిక పట్టండంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు గోవింద హరి గోవిందా అనే టైటిల్ వినిపిస్తోంది కానీ ఈ విషయంలో చిత్ర యూనిట్ ఎలా క్లారిటీ ఇవ్వలేదు.
చిరు ఈ సినిమాలో దేవాదాయ శాఖ అధికారిగా కనిపిస్తాడని అంత అనుకుంటున్నారు. విశాఖపట్నం జిల్లాలోని సింహాద్రి అప్పన్న దేవాలయం చుట్టూ జరిగిన నిజమైన సంఘటనల ఆధారంగా ఈ సినిమా సాగుతుందట. ఒరిజినల్ సిట్యుయేషన్స్ కి కొరటాల టచ్ ఇచ్చి మెసేజ్ ఓరియెంటెడ్ కమర్షియల్ సినిమా కథని రెడీ చేశాడని సమాచారం. 1996లో గుడికి చిన్నగుడిలి, పెందుర్తి మండలాల్లో ఉన్న 11000 ఎకరాలని అధికారులు సింహాద్రి అప్పన్న దేవాలయానికి పట్టా భూమిగా మార్చి ఇచ్చారు.
అధికారులు కేటాయించిన ఈ 11000 వేల ఎకరాల్లో కొంత భాగం రైతులు కష్టపడి పండించుకునే భూమి, వారి నుంచి లాక్కొని ప్రభుత్వంలో ఉన్న పెద్దల… నచ్చిన వాళ్ళకి కట్టబెట్టడానికి దేవుడి పేరు వాడుకున్నారనే వార్త అప్పట్లో బాగా స్ప్రెడ్ అయ్యింది. ముఖ్యంగా ఈ భూముల్లోని 1180 ఎకరాల పొలం విషయంలో చాలా అవకతవకలు జరిగాయి, ప్రూఫ్ ట్యాపరింగ్స్ కూడా జరిగాయి అన్నది అంతర్గత వర్గాల సమాచారం. ఈ విషయమై కోర్టులో చాలా కాలం పాటు కేసు కూడా సాగింది. ఇంతటి కథకి, ఈ విషయంలో పాలకుల తప్పులు వేలెత్తి చూపించడానికి ఒక దేవాదాయ శాఖ అధికారి… రైతుల పక్కన పోరాడడానికి ఒక నక్సలైట్ చేసే పోరాటం చేస్తే ఎలా ఉంటుంది? అనేదే #Chiru152 కథగా కొరటాల రాసి ఉండొచ్చు. పేపర్ మీదే చాలా పవర్ఫుల్ గా కనిపిస్తున్న ఈ కథకి కొరటాల మార్క్ కథనం, చిరు మార్క్ స్టైల్ అండ్ యాక్టింగ్ కలిస్తే వచ్చే వేసవికో దసరాకో మెగాస్టార్ బాక్సాఫీస్ ని దున్నేయడం ఖాయం.