పాన్ ఇండియా సెన్సేషన్ హను-మాన్ తర్వాత కె నిరంజన్ రెడ్డి ప్రైమ్‌షోఎంటర్‌టైన్‌మెంట్, ప్రియదర్శి, నభా నటేష్ లీడ్ రోల్స్ పోషిస్తున్న కంప్లీట్ డిఫరెంట్ మూవీ ‘డార్లింగ్’ తో ప్రాజెక్ట్‌తో వస్తున్నారు. శ్రీమతి చైతన్య ఈ రోమ్-కామ్ ను ప్రజెంట్ చేస్తున్నారు. అశ్విన్ రామ్ డైరెక్ట్ చేస్తున్నారు.
మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్‌లను కిక్ స్టార్ట్ చేశారు. సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ఫ్రస్ట్రేషన్ ఆంథమ్ ఖలసే ని రిలీజ్ చేశారు. వివేక్ సాగర్ పెప్పీ నంబర్‌ను కంపోజ్ చేశారు. ఈ పాటను హనుమాన్ సిహెచ్‌తో కలిసి రామ్ మిరియాల పాడారు. రామ్ మిరియాల వాయిస్ లో ఫన్ వైబ్ మరింత ఎనర్జీని క్రియేట్ చేసింది
ఈ పాట ఓ కామన్ మ్యాన్ ఫ్రస్ట్రేషన్ ప్రజెంట్ చేస్తోంది. అతని చుట్టూ ఉన్న వ్యక్తులు లైఫ్ లో చిల్ అవ్వమని చెబుతుంటారు. కాసర్ల శ్యామ్ సాహిత్యం హ్యూమరస్ గా వుంది. ఫ్రస్ట్రేషన్ ఆంథమ్ గా ప్రమోట్ చేస్తున్న ఈ పాటలో ప్రియదర్శి తన డ్యాన్స్ స్కిల్స్ చూపించారు. టైటిల్ గ్లింప్స్ అద్భుతమైన స్పందన లభించగా, ఫస్ట్ సింగిల్ కూడా ఇన్స్టంట్ హిట్‌గా నిలిచింది.
నటీనటులు: ప్రియదర్శి, నభా నటేష్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: అశ్విన్ రామ్
సంగీతం: వివేక్ సాగర్
డీవోపీ: నరేష్ రామదురై
ఎడిటర్: ప్రదీప్ ఇ రాఘవ
డైలాగ్స్: హేమంత్
ప్రొడక్షన్ డిజైనర్: గాంధీ
పబ్లిసిటీ డిజైనర్: అనంత్ కంచర్ల
క్రియేటివ్ ప్రొడ్యూసర్: సీతారామ్ వై
లిరిక్స్: కాసర్ల శ్యామ్
కొరియోగ్రాఫర్: విజయ్ పోలాకి, ఈశ్వర్ పెంటి
ప్రాజెక్ట్ కన్సల్టెంట్: సన్నీ బాండ్
కాస్ట్యూమ్ డిజైనర్: పూర్ణిమా రామస్వామి,
ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: ప్రకాష్ రెడ్డి పన్నాల, వంశీ సంగెం
లైన్ ప్రొడ్యూసర్: మంచి వెంకట్
పీఆర్వో: వంశీ-శేఖర్
డిజిటల్: హాష్‌ట్యాగ్ మీడియా