శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ‘కెరూబ్’ సినిమా గ్లింప్స్ లాంచ్

ఖుషి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై గోపి నారాయణ సమర్పిస్తూ బల్లెకారి బాలకృష్ణ నిర్మాతగా వస్తున్న సినిమా కెరూబ్. ఈ సినిమాకు కథ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, దర్శకత్వం జీవన్ ఇమాన్యుల్ చేయగా ఆర్ఆర్ ధృవన్ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాలో అనిరుద్, దివ్య విశ్వకర్మ, కల్పలత, సుమన్ శెట్టి, సురేష్, శ్రీధర్ మడ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కొరియోగ్రాఫర్ గా నిఖిల్ కిషోర్ మట్ల అలాగే సినిమాటోగ్రఫీ రమేష్ తోక చేస్తుండగా సౌండ్ మిక్స్ విష్ణుకోత చేస్తున్నారు. కెరూబ్ సినిమాకు లైన్ ప్రొడ్యూసర్ గా కన్నేపల్లి అఖిల్, పతిపాక ప్రణయ్ చేస్తుండగా బల్లెకారి స్వాతి సీఈఓ వ్యవహరిస్తున్నారు. బొమ్మకు స్టూడియో ద్వారా సౌండ్ మిక్స్ విష్ణు కోత, వి ఎఫ్ ఎక్స్ వర్క్స్ జైన వరుణ్ కుమార్, సుంకరపల్లి కార్తీక్ చేస్తున్నారు. ఈ సినిమా గ్లింప్స్ యూట్యూబ్ ద్వారా విడుదలవడం జరిగింది.

శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా విడుదలైన కెరూబ్ సినిమా గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్న విధంగా ఉంది. ప్రశాంతమైన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ తో అద్భుతమైన విఎఫ్ఎక్స్ తో గ్లిమ్ప్స్ ఉంది. కొత్త ప్రొడక్షన్స్ లో తొలి సినిమాగా రాబోతున్నాయి కెరూబ్ సినిమాతో కొత్త దర్శకుడు అలాగే మరి కొంతమంది కొత్త సాంకేతిక నిపుణులు పరిచయం కాబోతున్నారు.

ఓ యువకుడు మురళి ద్వారా సంగీతాన్ని ఇస్తుండగా ఓ ఆడగొంతు ఎవరు నువ్వు అని ప్రశ్నిస్తుంది. కేవలం ఆ ఒక్క డైలాగ్ తో ఈ గ్లీమ్ప్స్ ముగిస్తూ అద్భుతమైన గ్రాఫికల్ డిజైన్ తో కెరూబ్ సినిమా టైటిల్ రావడం మరింత ఆకర్షణీయంగా ఉంది.

నటీనటులు : అనిరుద్, దివ్య విశ్వకర్మ, కల్పలత, సుమన్ శెట్టి, గడ్డం సురేష్, శ్రీధర్ మడ

సాంకేతిక నిపుణులు:

కథ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, దర్శకత్వం: జీవన్ ఇమాన్యుల్
సమర్పణ: గోపి నారాయణ
నిర్మాత : బల్లెకారి బాలకృష్ణ
సీఈఓ : బల్లెకారి స్వాతి
సినిమాటోగ్రఫీ : రమేష్ తోక
సంగీతం:ఆర్ఆర్ ధృవన్
కొరియోగ్రఫీ : నిఖిల్ కిషోర్ మట్ల
లైన్ ప్రొడ్యూసర్ : కన్నేపల్లి అఖిల్, పతిపాక ప్రణయ్
ఆర్ట్ డైరెక్టర్ : కొక్కుల ప్రసాద్
బొమ్మకు స్టూడియో
సౌండ్ మిక్స్ : విష్ణు కోత
వి ఎఫ్ ఎక్స్ : జైన వరుణ్ కుమార్, సుంకరపల్లి కార్తీక్