ఎవరో ఎవరో కొట్టుకుంటే ఇంకెవరికో ఉపయోగం అన్నట్లు. తెలంగాణ ఆర్టీసీకి ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న పోరులో చిరంజీవి లాభ పడుతున్నాడు. అదేంటి చిరుకి సమ్మెకు ప్రభుత్వానికి సంబంధం ఏంటా అని ఆలోచిస్తున్నారా? తెలంగాణలో ఇప్పుడు ఆర్టీసీ కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. బస్సులు నడవక ఇక్కడ ప్రజలకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల ఇబ్బందులని గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. దసరా సెలవులు మరో వారం రోజుల పాటు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే 10 రోజులకు పైగా సెలవులు ఇచ్చింది తెలంగాణ సర్కార్. ఇప్పుడు మరోవారం రోజులు పొడగిస్తూ అక్టోబర్ 19వరకూ సెలవులకి ప్రకటించింది.
అక్టోబర్ 14 నుంచి ఓపెన్ కావాల్సిన స్కూల్స్ మరో ఇప్పుడు అక్టోబర్ 19 వరకు మూత పడనున్నాయి. అంటే మరో వారం పాటు రాష్ట్రంలో హాలీడేస్ ఉంటాయి. ఈ సెలవలే సైరా సినిమాకి బలం అయ్యే అవకాశం ఉంది. దసరా సీజన్ అయిపోయి కాస్త డల్ అయిన మార్కెట్ కి, ఈ వారం రోజులు ఎక్స్ట్రా బోనస్ గా దొరికాయి. బస్సులు లేకపోవడం, బయట ధర్నాలు జరగడంతో వేరే దారిలేక చాలా మంది థియేటర్స్ వైపు అడుగులు వేస్తారు. ఇది సైరా సినిమా బిజినెస్ ని పెంచే అవకాశం ఉంది. ఇక మెగాస్టార్ దూకుడుకి ఏ రేంజ్ వసూళ్లు వస్తాయో చూడాలి.