సూపర్ హీరో తేజ సజ్జతో కార్తీక్ ఘట్టంనేని సూపర్ యోధ నేపథ్యం లో సినిమా

హను మాన్ సినిమాతో అందరికి గుర్తుండిపోయే సూపర్ హీరో తేజ సజ్జ ఇప్పుడు కార్తీక్ ఘట్టమనేనితో దర్శకత్వంలో ఓ సినిమా తీయనున్నారు. ఈ సినిమా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్చనుంది. ఈగల్ సినిమాతో ఇప్పటికే పెఒప్లె మీడియా లో ఓ సినిమా చేసిన కార్తీక్ ఘట్టమనేని ఇప్పుడు అదే ప్రొడక్షన్ లో మరో సినిమా చేస్తున్నారు. పెఒప్లె మీడియా నుండి ఇది 36 వ ప్రాజెక్ట్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాకు సంబందించిన టైటిల్ ఈ నెల 18న మేకర్స్ ప్రకటించనున్నారు.

అద్భుతమైన టెక్నీషియన్ అయిన కార్తీక్ ఘట్టంనేని,తేజ సజ్జను భారీ క్యారెక్టర్లో ప్రెజెంట్ చేస్తూ లార్జర్ దాన్ లైఫ్ స్టోరీని రాశాడు. ఇది సూపర్ యోధా యొక్క సాహసోపేతమైన కథ. హై టెక్నికల్ మరియు ప్రొడక్షన్ స్టాండర్డ్స్ లో నిర్మించే ఈ చిత్రానికి గొప్ప సాంకేతిక నిపుణులు పనిచేయనున్నారు. తేజ హనుమాన్ తో పెద్ద హిట్ సాధించడంతో, దేశం మొత్తం అతని తదుపరి చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంది.


తారాగణం: సూపర్ హీరో తేజ సజ్

సాంకేతిక సిబ్బంది:
దర్శకుడు: కార్తీక్ ఘట్టంనేని
నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
క్రియేటివ్ ప్రొడ్యూసర్ : కృతి ప్రసాద్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుజిత్ కుమార్ కొల్లి
ఆర్ట్ డైరెక్టర్: శ్రీనాగేంద్ర తంగాల
రచయిత: మణిబాబు కరణం

PRO: వంశీ-శేఖర్