యాంగ్రీ హీరో కార్తి కథానాయకుడిగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఎస్.ఆర్.ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు, తిరుప్పూర్ వివేక్ నిర్మిస్తున్న డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఖైదీ’. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో శ్రీసత్యసాయి ఆర్ట్స్ కె.కె.రాధామోహన్ సమర్పిస్తున్నారు. దీపావళి కానుకగా అక్టోబర్ 25న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. ‘ఖైదీ’ సినిమా మొత్తం కథ కేవలం ఒక రాత్రి నాలుగు గంటల్లోనే జరుగుతుంది.
జీవిత ఖైదు చేయబడిన ఒక ‘ఖైదీ’ జైలు నుండి బయటకు వచ్చి బయటి ప్రపంచాన్ని ఎదుర్కోవాల్సి వస్తే.. అతను ఎలాంటి సవాళ్ళను ఎదుర్కున్నాడు? అనేది ‘ఖైదీ’ స్టోరీ లైన్. మొత్తం షూటింగ్ రాత్రులు కావడం, అది కూడా దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో ముఖ్యమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించడానికి చిత్ర యూనిట్ చాలా కష్టపడ్డారు. కథ డిమాండ్ మేరకు హీరోయిన్, పాటలు లేకుండా సినిమా చేశారు. రిలీజ్ సమయం దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. 146 నిమిషాల డ్యూరేషన్ తో ఉన్న ఖైదీ సినిమాకి సెన్సార్ బోర్డు క్లీన్ యూ/ఏ సర్టిఫికెట్ లభించింది. ఒక్క రాత్రిలో, నాలుగు గంటల్లో జరిగే కథతో కార్తీ హిట్ అందుకుంటాడేమో చూడాలి.