శంకర్ కి కూడా తప్పని లీకుల గోల… సేనాపతి సవారీ

కమల్ శంకర్ కలిసి భారతీయుడు సినిమా ఎప్పుడు మొదలుపెట్టారో తెలియదు కానీ అప్పటి నుంచి ఈ మూవీకి ఎదో ఒక కష్టం వస్తూనే ఉంది. స్టార్టింగ్ లో బడ్జట్ ఇష్యూస్ ఫేస్ చేసిన ఈ సినిమా, ఆ తర్వాత విలన్ పాత్ర కాస్టింగ్ విషయంలో చాలా ఇబ్బందులనే ఫేస్ చేసింది. అన్ని ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేసుకున్న తర్వాత చిత్ర యూనిట్ షూట్ కి వెళ్ళింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ భోపాల్ లో జరుగుతుంది.

Indian 2 leak

యాక్షన్ ఎపిసోడ్ కోసం భోపాల్ వెళ్లిన చిత్ర యూనిట్ కి లీకుల బెడద వచ్చి పడింది. శంకర్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కమల్ లుక్ లీక్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గుఱ్ఱపు స్వారీ చేస్తున్నట్లు ఉన్న ఈ ఫొటోలో కమల్, రెండున్నర దశాబ్దాల క్రితం ఉన్న సేనాపతినే మళ్లీ చూపించనున్నాడని అర్ధమయ్యింది. భారతీయుడు లుక్ కి ఉండే ఆ ఫీల్ అలానే క్యారీ చేయడానికి శంకర్ అండ్ టీం చాలా కష్టపడుతున్నారు ఇలాంటి సమయంలో కమల్ లుక్ ఇలా లీక్ అవ్వడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది.