మ‌రోసారి త‌ల్లి కాబోతుంది.. ప్రెగ్నెన్సీ ఉన్న‌వారికి క‌రీనాక‌పూర్ స‌ల‌హాలు..

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్‌, క‌రీనా క‌పూర్ మ‌రోసారి త‌ల్లిదండ్రులు అవుతున్నార‌ని విష‌యం తెలిసిందే. సైఫ్ అలీఖాన్, క‌రీనా క‌పూర్ 2012లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2016లో బాబు పుట్టాడు. అత‌డికి తైమూరు అలీఖాన్ ప‌టౌడి అని నామ‌క‌ర‌ణం చేశారు. ప్ర‌స్తుతం తైమూరు వ‌య‌సు మూడేళ్లు.. కాగా క‌రీనా క‌పూర్ తొలిసారి గ‌ర్భం దాల్చిన‌పుడు ఆ వార్త టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది.

karina

ఇప్పుడూ అదే ప‌రిస్థితి.. అప్ప‌టి నుంచి సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. త‌న ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ.. అభిమానుల‌తో పంచుకుంటుంది. అలాగే ప్రెగ్నెన్సీ ఉన్న‌వారు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలో కూడా సోష‌ల్ మీడియాలో తెలిపింది. నిత్యం వ్యాయామం చేయాల‌ని, హెల్తీ ఫుడ్ తీసుకోవాల‌ని చెప్పింది. ఇంకా మ‌న‌ల్ని మ‌నం శుభ్రంగా ఉంచుకోవ‌డం ప‌రిస‌రాల ప‌రిశుభ్ర‌త పాటించ‌డం చాలా ముఖ్య‌మ‌ని తెలిపింది. కాగా త‌న ప్రెగ్నెన్సీ ఫోటోలు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ అవుతుంది.