సింగం కాంబినేషన్ మళ్లీ రిపీట్

తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా వచ్చిన డైరెక్టర్ హరి తెరకెక్కించిన మయుడు, సింగం సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాలు బ్లాక్ బస్టర్ విజయం సాధించాయి. ఈ సినిమాల్లో పోలీస్ పాత్రలో సూర్య నటన, డైలాగులు చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయి. అయితే ఇప్పుడు సూర్య-హరి కాంబినేషన్‌లో మరో సినిమా రోబోతుందట.

HARI MOVIE WITH SURYA

మార్చిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందని సమాచారం. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పల్లెటూరి వాతావరణంలో సాగే కథ అని తెలుస్తోంది. ఇప్పటికే ఈ కథను సూర్యకు హరి చెప్పగా.. సూర్య కూడా సినిమా చేసేందుకు ఒకే చెప్పాడట.