కన్నడ హీరో ఉపేంద్ర తెలియని తెలుగు సినీ అభిమాని ఉండడు. కన్నడలో స్టార్ హీరో అయినా తెలుగులో అప్పుడప్పుడూ మెరిసే ఉపేంద్ర ప్రస్తుతం వరుణ్ తేజ్ గని మూవీలో యాక్ట్ చేస్తున్నాడు. ప్రతి సినిమాలో తన మార్క్ కొత్తదనం, తింగరితనం చూపించే ఉపేంద్ర రాజకీయాల్లోకి కూడా వచ్చాడు. ఉత్తమ ప్రజాకీయా అనే పేరుతో పార్టీ పెట్టిన ఉపేంద్ర ప్రజలకి తన వంతు సాయం చేస్తూనే ఉంటాడు. అయితే ఈ లాక్ డౌన్ లో ఏం అయ్యిందో తెలియదు కానీ ఉపేంద్ర నాకు సీఎం కావాలని ఉంది, పోటీ చేస్తే గెలిపిస్తారా అంటూ ఓపెన్ లెటర్ రిలీజ్ చేసాడు.
మీకోసం కష్టపడతాను నాకు ఓటు వేస్తారా అని అడిగిన ఉపేంద్ర, ఎన్నికల సమయంలో రూలింగ్ పార్టీ చేస్తున్న అన్యాయాల్ని ప్రశ్నిస్తాను.. అపోజిషన్ పార్టీ ఫెయిల్యూర్ ఎత్తి చూపిస్తాను నాకు ఓటు వేస్తారా అని అడిగాడు. ఇక్కడి వరకే ఉపేంద్ర లెటర్ ఉంటే అందులో తన మార్క్ ఏముందిలే అనుకుంటున్నారా? ఇక్కడి నుంచి అసలు లెటర్ స్టార్ట్అయ్యింది. మీరు నన్ను ఎన్నుకుంటారో లేదో నాకు తెలియదు కానీ నేను మాత్రం ఎన్నికల్లో పోటీ చేయను అని స్పష్టంగా చెప్పేశాడు. ఎన్నికల్లో పోటీ చేయకుంటే ఇక పార్టీ ఎందుకు అనే కదా మీ అనుమానం, నేను మీ తరపున నిలబడతాను. అకౌంటబిలిటీ లేని నాయకులని అధికారం నుంచి కిందకి దించుదాం, ఇప్పుడు ఉన్న పద్ధతి మారడానికి మరికొన్ని ఎలెక్షన్స్ పట్టొచ్చు, సమయం తీసుకోనివ్వండి. మార్పు మాత్రం జరిగి తీరుతుంది. నేను మీ సీఎం అవుతా, కామన్ మ్యాన్ అవుతా అంటూ ఉపేంద్ర లెటర్ ముగించాడు. తన ఉద్దేశం ఏంటీ అంటే ఎన్నికల్లో పోటీ చేయను కానీ నా మనుషులని నిలబెడతాను. ఎన్నికైన ఏ ఒక్కరు సరిగా పని చేయకపోతే వాళ్లని ఆ పదవి నుంచి తప్పిస్తాను అని. Simple and Straight గా చెప్పాలి అంటే, He wants to be a king maker not the king.