సినిమా థియేటర్లను తెరిపించాలని కర్ణాటక ‘సీఎం’ని కలిసిన సినీ ప్రముఖులు!!

కరోనా వైరస్ వలన దేశవ్యాప్తంగా సినిమా థియేటర్లు గత కొన్ని నెలలుగా మూత పడిన విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా సినిమా పరిశ్రమలు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అయితే ప్రతి ఇండస్ట్రీ సభ్యులు కమిటిగా ఏర్పడి ఆయా ప్రభుత్వాలని కలిసి థియేటర్స్ ఓపెన్ చేయడానికి అనుమతులు కోరుతున్నారు.

ఇక కేంద్రం అనుమతి ఇచ్చిన తరువాత సినిమా థియేటర్లు తెరవడం గురించి కర్ణాటక హీరోలు, నిర్మాతలు, ఎగ్జిబిటర్లు కూడా కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పని ప్రత్యేకంగా కలిశారు. పునీత్ రాజ్ కుమార్ తో పాటు KGF హీరో యష్ అలాగే చాలా మంది హీరోలు, దర్శకులు కూడా ఈ మీటింగ్ లో పాల్గొని సినీ పరిశ్రమలోప్రస్తుతం నెలకొన్న సమస్యల గురించి అలాగే థియేటర్స్ ఓపెన్ చేయడానికి అనుమతులు ఇవ్వాలని కోరారు. సమీక్షల అనంతరం ముఖ్యమంత్రి యడ్యూరప్ప సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.